రజినీకాంత్ ఈ పేరు చెప్తే చాలు... సౌత్ లో ఒక ఊపు వస్తుంది.  సౌత్ ఇండియాలో ఎన్నో బెస్ట్ సినిమాల్లో నటించారు.  సౌత్ లో మాత్రమే కాదు ఇండియా మొత్తం రజినీకాంత్ కు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు.  రజినీకాంత్ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు.  సినిమా సినిమాకు అయన క్రేజ్ పెరుగుతున్నది తప్పించి తగ్గడం లేదు.  69 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ ఆకట్టుకోవడం విశేషం.  


ఇక ఇదిలా ఉంటె,  ఇప్పటికే రజినీకాంత్ 167 సినిమాలు పూర్తి చేశారు.  బాలచందర్ శిస్యుడిగా తెరంగ్రేటం చేసిన శివాజీ గైక్వాడ్ అలియాస్ రజినీకాంత్... తమిళ సినిమా రంగంలో మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగెటివ్ రోల్స్ చేస్తూనే హీరోగా ప్రోమోట్ అయ్యాడు.  హీరోగా ప్రోమోట్ అయ్యిన తరువాత రజినీకాంత్ తనదైన స్టైల్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.  


రజిని తన మ్యాజరిజంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ ప్రతి సినిమాను తనదైన శైలిలో అదరగొట్టాడు.  క్లాస్ తో పాటుగా మాస్ ప్రేక్షకులను సైతం మెప్పించగల సత్తా ఉన్న నటుడు రజినీకాంత్.  బాషా సినిమాలో అయన నటన చూస్తే షాక్ అవ్వాల్సిందే.  నరసింహలో ఓ టైపు మ్యాజరిజం... చంద్రముఖి సినిమాలో మరోలా.. శివాజీలో ఒకలాగా, అదే విధంగా రోబో సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు.  


69 ఏళ్ల వయసులో కూడా రోబో 2.0 సినిమాలో రజినీకాంత్ కుర్రోడిలా మెప్పించాడు.  పేట సినిమాలో సైతం స్టెప్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు.  ఇప్పుడు మురుగదాస్ దర్బార్ సినిమాలో రజిని ఆదిత్య అరుణాచలంగా అదిరిపోయేలా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.  ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9 న రిలీజ్ కాబోతున్నది.  ఈ మూవీ రిలీజ్ కాకముందే రజినీకాంత్ శివ దర్శకత్వంలో కొత్త సినిమాకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.  సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: