ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఈరోజు విడుదలైంది. వర్తమాన రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ పాత్రలకు తగిన నటుల్ని ఎంచుకోవడంతోనే సగం విజయం సాధించాడు. సినిమాలో జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో లోకేశ్ పాత్ర ఏడ్చే సీన్ ను రామ్ గోపాల్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడు. 
 
సినిమాలో జగన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి  ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జగన్ ప్రమాణ స్వీకారం చూసిన లోకేశ్ ఏడుస్తూ తలుపు గడియ పెట్టుకుంటాడు. లోకేశ్ భార్య పాత్రలో రమణి తలుపు తీయండి అంటూ లోకేశ్ ను ఓదార్చే సీన్ హైలెట్ గా నిలిచింది. లోకేశ్ పాత్రను, చంద్రబాబు పాత్రను వర్మ కళ్లకు కట్టినట్లుగా సినిమాలో చూపించాడు. లోకేశ్ పాత్రలోని డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. లోకేశ్ పాత్ర చేసే కామెడీ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచింది. 
 
లోకేశ్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని బాబును అడగగా బాబు ఏడుస్తున్న లోకేశ్ ను ఓదారుస్తూ ఇప్పుడు వాళ్లకు టైం వచ్చింది మనకు కూడా టైం వస్తుందని చెబుతాడు. అప్పుడే సినిమాలో పప్పు లాంటి అబ్బాయి సాంగ్ వస్తుంది.క్లైమాక్స్ సన్నివేశాలను ఆర్జీవీ అద్భుతంగా తెరకెక్కించాడు. 
 
బాబులోని పాజిటివ్స్ ను, నెగిటివ్స్ ను చూపించిన వర్మ బాబు వెన్నుపోటును అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా అక్కడక్కడా కొంచెం స్లోగా ఉన్నా సినిమాలోని పాత్రలతో కనెక్ట్ కావటంతో ప్రేక్షకులు బోర్ ఫీలవ్వకుండా చేయడంలో ఆర్జీవీ సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు చాలాకాలం తరువాత రామ్ గోపాల్ వర్మ నుండి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. విడుదలకు ముందు ఎన్నో వివాదాలకు ఎదుర్కొన్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులను ఆకట్టుకొవటంలో సఫలమైందని చెప్పవచ్చు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: