టాలీవుడ్ లోకి తేజ దర్శకత్వంలో ‘జయం’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు నితిన్.  మొదటి నుంచి తండ్రి డిస్ట్రిబ్యూట్ రంగంలో ఉండటంతో సినీ ప్రపంచానికి బాగా దగ్గరైన నితిన్ ‘జయం’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ‘దిల్’ సినిమ సూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్లు అవుతుంది. అయితె కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్స్ లేకున్నా.. హీరోగా ఎక్కడా డ్యామేజ్ కాకుండా తన టాలెంట్ చూపిస్తూ వస్తున్నాడు. గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, అ ఆ మూవీస్ నితిన్ కెరిర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.  ప్రస్తుతం భీష్మ మూవీలో నటిస్తున్నాడు నితిన్.  ఇప్పటి వరకు టాలీవుడ్ లో నితిన్, ప్రభాస్, రానా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న విషయం తెలిసిందే.

 

ఆ మద్య నితిన్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.  కానీ అఫిషియల్ గా మాత్రం ప్రకటించలేదు. తాజాగా  నితిన్ వివాహం పై ఓ ఆసక్తికర వార్త బయటికొచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట. కొంత కాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్ ఆమెను పెళ్లిచేసుకోనున్నారట.  నితిన్ ప్రేమించిన అమ్మాయి కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే కావడం విశేషం.  అయితే టాలీవుడ్ లో హ్యాండ్ సమ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ ను వివాహం చేసుకోనున్న ఆ లక్కీ గర్ల్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది.

 

కొంత కాలంగా వరుసగా అపజయాలతో సతమతమవుతున్న నితిన్ లాంగ్ బ్రేక్ తీసుకున్న తర్వాత వరుసగా నాలుగు చిత్రాలు ప్రకటించారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న భీష్మ, వెంకీ అట్లూరి దర్శకుడిగా రంగ్ దే చిత్రాలు చేస్తున్న నితిన్ చంద్ర శేఖర్ ఏలేటి తో ఒక సినిమా, కృష్ణ చైతన్య అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు.  మరి ఈ మూవీస్ తర్వాత తన పెళ్లి విషయం అఫిషియల్ గా చెబుతాడా..లేక ఈలోగానే అనౌన్స్ చేస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: