వర్మ ఎలాంటి వ్యక్తో అందరికి తెలిసిందే.  వర్మ సినిమాలు ఎలా ఉంటాయోకూడా తెలుసు.  శివ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వర్మ, ఆ తరువాత కొంతకాలం పాటు కొన్ని అద్భుతమైన సినిమాలు తీశాడు.  టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం గడగడలాడించాడు.  బాలీవుడ్ లో బెస్ట్ అనే విధంగా సినిమాలకు దర్శకత్వం వహించిన వర్మ ఆ తరువాత తన రూట్ మార్చి మొత్తం షేక్ చేశాడు.

 
సినిమాలు ఇలా కూడా తీయొచ్చు అనే విధంగా చిత్రీకరించడం మొదలుపెట్టాడు వర్మ.  టాలెంట్ ఉంటె చాలు.. పెద్ద పెద్ద కెమెరాలు.. పెద్ద పెద్ద లైటింగ్ లు అవసరం లేదు.  మొబైల్ లో కూడా సినిమా షూట్ చెయ్యొచ్చు అని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు వర్మ.  అయితే, వర్మ తీసిన సినిమాలు ఇటీవల కాలంలో వరసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి.  


లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తప్పించి మరో సినిమా హిట్ కాలేదు. అంతకు ముందు వర్మ 9/11, రక్తచరిత్ర ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశాడు.  ఇప్పుడు వర్మ తన శిష్యులను ప్రోమోట్ చేస్తూ వర్మ నిర్మాతగా మరి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా తీశాడు.  ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  సినిమాలో అనేక వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయి. వివాదాలు సృష్టించడంలో వర్మ టాప్ అని చెప్పొచ్చు. 


ఇకపొతే, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో వర్మ ఓ పాత్ర చేశాడు.  తన సొంత పాత్రే అది.  అమ్మాయిలపై చేసే కామెంట్స్, తనపై తాను చేసుకునే కామెంట్లు సినిమాలో హైలైట్ గా నిలిచాయట.  ఆడదంటే ఓ సెక్స్ సింబల్ అని, ఆడదాన్ని అలానే చూస్తారని వర్మ చెప్పే స్టైల్ సినిమాలో ఒక రేంజ్ లో ఉన్నది.  ఇక ఈ సినిమాలో అయినేని రమ హత్యకేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో వర్మ వేసే సెటైర్లు సినిమాకు హైలైట్ అయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: