వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అయినా  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సిద్ధార్థ్ తాతోలుతో కలిసి  తెరకెక్కించిన సినిమా  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మొదటి దీని పేరు కమ్మ రాజ్యం లో కడప బొడ్డలు అని పెట్టిన వివిధ కారణాల వాళ్ళ టైటిల్ పేరు ఐతే మార్చారు ఈ  సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. సినిమాను ఆపాలని కొందరు ప్రయత్నించిన సఫలం కాలేదు.

 

ఎట్టకేలకు   సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను ఆపాలని చూసిన వారిని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను వదిలారు వర్మమొత్తానికి తనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చేసి చూపించారు.
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..సారీ అలవాటులో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే మా సినిమాను ఆపడానికి చాలా మంది ప్రయత్నించారు. వెనకాల నుంచి గోతులు తీసి, ఎవరెవరికో ఏదేదో చెప్పి రకరకాలను క్రియేట్ చేసి కేసులు ఫైల్ చేశారు. మొత్తానికి వారిది వర్కవుట్ అవ్వలేదు. అనుకున్న ప్రకారం ఈరోజు సినిమా విడుదల  అవుతోంది.

 

ఇక్కడ  అసలైన పాయింట్ ఏంటంటే... ప్రజాస్వామ్యంలో  ఎవరికైనా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. అన్నీ ఆలోచించే సినిమా తీశాను. అంత బుర్రలేకుండా వ్యవహరించలేదు. కానీ దీనిని ఆపడానికి చాలా మంది ట్రై చేశారు. ఎందుకు ట్రై చేశారు? ఎంత డబ్బు ఇచ్చారు? వీటన్నింటినీ చాలా తొందరలో బయట పెడతాను . వారిపై చట్ట ప్రకారం చర్యలు  కూడా తీసుకోబోతున్నాం’’

 

‘‘ దాని గురించి తర్వాత మాట్లాడతా.అంటూ  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా మే 2019 నుంచి సెప్టెంబర్ 2020 మధ్యలో జరిగిన ఘటనల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా. అప్పుడే 2020 ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ పాయింట్ అదే. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల ద్వారా ఏం జరుగుతుంది అని ఊహించి తీసిన సినిమా. ఇలాంటి జోనర్‌లో ఏ సినిమా రాలేదు. ఈ సినిమా ఓ సెటైర్. సెటైర్‌కి కామెడీకి తేడా ఏంటంటే.. కామెడీ అనేది కేవలం నవ్వించడానికి. ఈ సినిమాలో నటించినవారు ఏ  ఒక్క పార్టీకి సంబంధించినవారు కాదు.

 

నేను ఎవ్వరినీ తక్కువ గ చేసి చూపలేదు  ఎక్కువచేయలేదు . ఆ విషయం మీకు సినిమా చూశాక తెలుస్తుంది.  ఈ సినిమా లో  అసెంబ్లీలో జరిగే జోకులు మరే సినిమాలోనూ ఉండవు. ఓ దర్శకుడిగా నాకు అనిపించిన విషయాన్ని స్క్రిప్ట్‌లా రాసి సినిమా గ తీసాను . ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. దయచేసి సినిమాను చూడండి. ఇది సీరియస్ ఫన్ సినిమా. ఫన్నీగా అనిపించే సీరియస్ సినిమా’’అంటూ వర్మ మాట్లాడారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: