సీనియర్ నటుడు  గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతచెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స చికిత్సపొందుతూ  గొల్లపూడి తుదిశ్వాస విడిచారు. 250 సినిమాలకు పైగా గొల్లపూడి నటించారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి   జన్మించారు. తెలుగు కళ్ళమ్మతల్లికి గొల్లపూడి ఎనలేని సేవలను అందించారు.

 

విలక్షణ నటుడిగా గొల్లపూడి తనకంటూ ఓ ప్రత్యకతను సంపాదించుకున్నారు. గొల్లపూడికి ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్.   గొల్లపూడి మృతితో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. రరచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా గొల్లపూడి మారుతీరావు సుపరిచితులు. గొల్లపూడి తన సినీ కెరియర్ లో ఆరు నంది అవార్డులను అందుకున్నారు.  గొల్లపూడి మారుతీరావు నటించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య(1982).  

 

గొల్లపూడి నటించిన చివరి చిత్రం జోడి 42 ఏళ్ల వయస్సులో మొదటి సినిమాలో గొల్లపూడి నటించారు. మూడున్నర దశాబ్దాలకుపైగా సినీరంగంలో ఎన్నో పాత్రలుపోషించిసుమారు 290కిపైగాచిత్రాల్లోనటించారు.ప్రతినాయకుడిగా,సహాయనటుడిగా, హాస్యనటుడిగా  గొల్లపూడి మెప్పించారు.  గొల్లపూడికి గద్దముక్కు పంతులు పేరు పెట్టారు దర్శకుడు కోడిరామకృష్ణ ఆతర్వాత సుందరకాడ చిత్రంలో గొల్లపూడిని సింగిల్ పూరీ శర్మగా  రాఘవేందర్ రావు మార్చారు. దాశరథి ప్రోత్సహంతో సినీ రచయితగా మారారు. దేవులపల్లి కృష్ణశాస్త్రితో కలిసి రచనలు చేసిన గొల్లపూడిశాస్త్రీయ సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదించే వారు. 1963లో 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో పనిచేసారు. 14 ఏళ్ల వయస్సులోనే మొదటి కథ ఆశాజీవి రాసారు.

 

దుక్కిపాటి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన డాక్టర్ చక్రవర్తికి తొలి సినిమా రచన చేసారు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరానికి రచయితగా కూడా పనిచేసారు.  సంవత్సరంలో 31 సినిమాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మూడో చిత్రంలోనే  గొల్లపూడి ద్విపాత్రాభినయం చేసారు. విద్యార్థి దశలోనే నాటకాల్లో నటించిన గొల్లపూడి. ఆత్మగౌరం చిత్రానినికి ఉత్తమ కథగా నంది పురస్కారాన్ని అందుకున్నరు. తరంగిణి చిత్రంలో ఉత్తమ హాస్యనటుడిగా , రామాయణంలో భాగవతం చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా ,ప్రేమ పుస్తకం చిత్రానికి ఉత్తమ స్క్రీన్ కు నంది పురస్కారం, 1996లో ఉత్తమ టీవీ నటుడిగా నంది పురస్కారాన్ని  గొల్లపూడి అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: