వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఈరోజు విడుదలైంది. అయినేని రమా పేరుతో ఆర్జీవీ దేవినేని ఉమ పాత్రను పరిచయం చేశాడు. పులి కడుపున ఓ పిల్లిని పుట్టించాడని నా కొడుకు గదిలోకి దూరి ఏడుస్తున్నప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుందే అని బాబు చెబుతూ ఉండగా అయినేని రమా పాత్ర సినిమాలో పరిచయం అవుతుంది. 
 
అయినేని రమా పదే పదే ప్రెస్ మీట్లు పెడుతూ వేలును చూపిస్తూ ఆఫ్ట్రాల్ ఈవీఎం సీఎం అంటూ కామెంట్లు చేస్తూ ఉంటాడు. జగన్నాథ్ రెడ్డి నీ కుట్రలను భూ స్థాపితం చేస్తాం అంటూ కామెంట్లు చేస్తూ ఉంటాడు. వర్మ పరోక్షంగా అయినేని రమా ప్రెస్ మీట్లకు మాత్రమే ఉపయోగపడతాడు అనే విధంగా చూపించాడు. ఫస్టాఫ్ లో ప్రేక్షకులు ఊహించని విధంగా అయినేని రమా పాత్రను చంపేసి వర్మ షాక్ ఇచ్చాడు. అయినేని రమాను పరుగెత్తించి పరుగెత్తించి నడిరోడ్డు మీద దారుణంగా కొంతమంది హత్య చేస్తారు. 
 
హత్య కేసు విషయాలను వెల్లడించటానికి అమెరికా నుండి పీపీ చాల్ వస్తాడు.పీపీ చాల్ పాత్ర చేసే కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు హిట్ టాక్ వస్తోంది. విడుదలకు ముందు ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. కీలక పాత్రల్లో నటించిన నటులందరూ కొత్త వాళ్లే అయినప్పటికీ నటులందరూ అద్భుతంగా నటించారు. కథ, కథనం మరీ అద్భుతంగా లేకపోయినా ప్రేక్షకులు సినిమాలోని పాత్రలకు కనెక్ట్ కావటంతో వర్మ సక్సెస్ అయ్యాడు. 
 
ఈ సినిమాలో కేఏ పాల్ పాత్ర నటించిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. వైసీపీ పార్టీని అభిమానించే వారిని అలరించే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. నటీనటులందరూ ఆయా పాత్రల్లో అద్భుతంగా జీవించారు. టెక్నికల్ అంశాల్లో మాత్రం వర్మ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: