‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలను అడ్డుకోవాలని ప్రయత్నించిన అందరికీ ఈ సినిమా ఈ రోజు విడుదల అవడంతో ఇలాంటి వారికి బ్యాడ్ న్యూస్గా చెప్పవచ్చూ.. ఇకపోతే కొంత మంది మోసగాళ్లు, జోకర్లు ఈ సినిమాను ఆలస్యం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ, రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోలేకపోయారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు డిసెంబర్ 12న సినిమా విడుదల అయ్యింది ఈ విషయంలో వర్మ పుల్ కుషిగా ఉన్నాడు..

 

 

ఇకపోతే సినిమా మొదలెడితే, మొత్తం 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన బాబు గారు ఆయన పార్టీ ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. ఓటమి తర్వాత బాబు గారి భజన చేసే రాజకీయ నాయకులు ఒక బ్యాచ్ గా బాబు గారిని భరించలేని నాయకులు ఇంకొక బ్యాచ్ గా విడిపోతారు. ఇలా విడిపోయిన వాళ్ళు అధికార పార్టీలో కి వెళ్దాం అంటే..?

 

 

అధికార పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఆయన పార్టీ లోకి వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లక తప్పదు. మరి ఈ పరిస్థితుల్లో గతంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి తన పిల్లనిచ్చిన మామను ఎలాంటి ఇబ్బందులు పెట్టాడో..? అలానే శాంతిభద్రతల సమస్యలు సృష్టించి రాష్ట్రంలో అల్లకల్లోలం రేపడానికి పూనుకుంటాడు ఓడిపోయిన బాబు గారు. ఇకపోతే లోకేష్ క్యారెక్టర్ తీరు చాలా కామేడిగా సాగుతుంది.. ముఖ్య‌మంత్రి స్పీచ్ చిన‌బాబు బ‌ట్టీ ప‌డుతుంటే భ‌ర్త క‌స్టానికి మురిసిపోయిన ర‌మ‌ణి అంటే భార్య పాలు తెచ్చి ఇస్తే సుగ‌ర్ వేశావా అని అడుగుతాడు... తీయ‌గా ఉంది అని చెపుతాడు.. అదే టైంలో కుక్కుల మొరుగుతాయి. అంటే ఈ స్పీచ్ తాను సీఎం అయితే ఎలా ప్ర‌మాణ‌స్వీకారం చేయాలో బ‌ట్టీ ప‌డుతూ ఉంటాడు. అందులోనూ త‌ప్పులు అప్పుడు ర‌మ‌ణి స‌రి చేస్తుంది.

 

 

ఆ పప్పు చేసే తప్పులకు కడుపు ఉబ్బేలా నవ్వులు తప్పవు. మాటలు నేర్చే పిల్లాడిలాగా పప్పు చుచ్చు చుచ్చు మాటలు ప్రేక్షకులను నోరుపోయేలా నవ్విస్తున్నాయి. రాజకీయ కుటుంబంలో పుట్టిన బాబోరి బుడ్దపిల్లడు అసలు రాజకీయ పాఠాలు వొంటపట్టించు కోలేదు. మొత్తానికి వర్మ క్రియేట్ చేసిన లోకేషం మాలోకం అనే పాత్ర చూస్తే మతిపోయేలా నవ్వుల్ ఆగకుండా ఉందంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: