తెలుగు సినిమా పరిశ్రమ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది. రచయిత, నటుడు అయిన గొల్లపూడి మారుతీ రావు గురువారం చెన్నై హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ ఈరోజు అందరిని విడిచి వెళ్లిపోయారు. రచయితగా నటుడిగా ఆయనకు ఆయనే సాటి అనేలా గొల్లపూడి మారుతీరావు ప్రతిభ కనబరిచారు.      

 

తెలుగులో ఎన్నో నాటకాలు, కథలు, నవలలు రాసిన ఆయన ఎన్నో పత్రికల్లో పనిచేశారు. 1959 లో ఆంధ్రప్రభ ఉపసంచలకుడిగా పనిచేసిన గొల్లపూడి మారుతీరావు అదే పత్రిక చిత్తూరు ఎడిషన్ ప్రారంభించగా సంపాదకుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆకాశవాణిలో ట్రాస్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు మారుతీరావు. ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడలో పనిచేసి ప్రమోషన్ వచ్చి అసిస్టెంట్ డైరక్టర్ గా రిటైర్మెంట్ చేశారు.

 

మారుతీరావు రాసిన తొలి కథ ఆశాజీవి. ఆయన కలం నుండి ఎన్నో గొప్ప కథలు వచ్చాయి. నాటకాలు, కథలు, నవలలు కూడా రాశారు గొల్లపూడి మారుతీరావు. మారుతీరావు రచనలకు ప్రత్యేక ఖ్యాతి ఉంది ఆంధ్ర విశ్వవిద్యాలయం థియేటర్ ఆర్ట్స్ విభాగంలో మారుతీరావు రచనలను పాఠ్యపుస్తకాలుగా ప్రచురించారు.

 

రచయితగానే కాదు నటుడిగా కూడా ఆయన ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు గొల్లపూడి మారుతీరావు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా రిటైర్ అయ్యి సినిమాల మీద ఉన్న ఇష్టంతో నటుడిగా మరో కెరియర్ మొదలు పెట్టి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచారు మారుతీరావు. ఆయన మరణ వార్త విన్న తెలుగు ప్రేక్షకులు సైతం షాక్ అవుతున్నారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనా ఆయన కథలు.. పాత్రలతో మన హృదయాల్లో ఎప్పటికి నిలిచి ఉంటారని చెప్పొచ్చు. మారుతీరావు మరణ వార్త విని తెలుగు సిని పరిశ్రమలో కూడా విషాద చాయలు అలముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: