వివాదాస్పద దర్శకుడు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన అత్యంత వివాదాస్పద చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. అయితే ఈ సినిమా ఎవరికి అనుకూలంగా ఉంటుంది...ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందనే కుతూహలంతో ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రంలో ఓ సీన్ లోకేష్ రాజకీయాల్లో ఎలా ఉండాలనే దానిపై చంద్రబాబు, బ్రాహ్మణిలు ట్రైనింగ్ ఇస్తున్నట్లు చూపించారు.

 

ఇక ఈ సీన్ ఫుల్ కామెడిగా ఉంది. ఇందులో బాబు, బ్రాహ్మణిలు లోకేష్ కు ట్రైనింగ్ ఇవ్వలేక ఆపసోపాలు పడతారు. అసలు ఎలా మాట్లాడాలో, సభల్లో ఎలా ప్రసంగించాలో, చివరికి చేయి ఎలా ఊపాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. లోకేష్ ని ఎలా అయిన నాయకుడు చేయాలనే ఇదితో బాబు, బ్రాహ్మణి, భువనేశ్వరిలు ట్రైనింగ్ ఇవ్వడం పిచ్చ కామెడీగా ఉంది. అలాగే కార్యకర్తలందరికి నమస్కారం అని చెప్పడం కూడా లోకేష్ కు రాలేదనే విధంగా వర్మ సెటైరికల్ సీన్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే లోకేష్ ని ఒక ఆట ఆడేసుకున్నారు. చివ‌ర‌కు లోకేష్‌కు సెల్ఫీ తీసుకోవ‌డం కూడా రాక‌పోతే బాబు త‌ల ప‌ట్టుకునే సీన్ మ‌రీ హైలెట్ అయ్యింది.

 

కాగా, ఈ సినిమాపై కొందరు హైకోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే. కానీ చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు చిత్ర విడుదలపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డుదే తుది నిర్ణయమని హైకోర్టు తెలిపింది. దీంతో సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చింది.  ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేశాడు. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను ఆపాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ దుర్వార్త అంటూ.. తన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని తెలిపాడు.  ఏదేమైనా వర్మ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చాడు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: