గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం అన్ని అవాంతరాలని దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. వర్మ సారథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రతి సీన్ పొలిటికల్ సెటైరికల్ గానే ఉంది. ముఖ్యంగా ట్రైలర్లని బట్టి చూస్తే చంద్రబాబు, లోకేశ్ లని ఎక్కువ టార్గెట్ చేసి చిత్రం తెరకెక్కినట్లు అనిపించింది. ట్రైలర్ కు తగ్గట్టుగానే చిత్రంలో బాబు, లోకేష్ లపై ఫుల్ సెటైర్లు ఉన్నాయి.

 

ఇందులో టీడీపీ ఓడిపోయాక అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే నేపథ్యంలో వచ్చిన సీన్ బాగా ఆకట్టుకుంది.
ఓడిపోయాక చంద్రబాబు అసెంబ్లీకి వెళుతుంటే లోకేష్ మాట్లాడుతూ..;నాన్నగారు ఈ టైమ్ లో మీరు అసెంబ్లీకి వెళ్ళడం అవసరమా అని అంటాడు. అప్పుడు బాబు సమాధానం చెబుతూ....చూడు చినబాబు అసెంబ్లీలో 151 మేక‌లు, 22 పులులు, 1 సింహం ఉన్నాయి.. మేక‌ల‌ను భ‌య పెట్టాలి కాని భ‌య‌ప‌డ‌కూడ‌ద‌ని సెటైర్ లాగా చెబుతాడు. మొత్తానికి ఈ సీన్ రివర్స్ కామెడీలో ఉంటుంది.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’అని టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని వర్మ టైటిల్ మార్చాడు. అయితే ఎంత పేరు మార్చిన ఈ సినిమాకి ఆల్రెడీ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ప్రారంభమే ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. పైగా చిత్రంలోని పాత్రలు కూడా అచ్చు గుద్దినట్లు ప్రస్తుతం ఏపీలో ఉన్న నాయకులని దించేశారు.

 

దానికి తోడు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు తెరకెక్కించడంతో చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అలాగే సినిమా ట్రైలర్లు కూడా బాగా వైరల్ కావడంతో సినిమాకు విడుదల ముందే మంచి క్రేజ్ వచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: