అక్కినేని దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం ఓపెన్ సీక్రెట్. వెంకటేష్ నాగార్జున మధ్య సఖ్యత ఏస్థాయిలో ఉందొ అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా వీరిద్దరి మధ్య శతృత్వం లేదు అదేవిధంగా వీరిద్దరూ చాల సఖ్యతగానే కనిపిస్తూ ఉంటారు. చిరంజీవి బాలకృష్ణ మధ్య ఉన్న గ్యాప్ అందరికి తెలిసిన విషయం కావడంతో చిరు బాలయ్యల అభిమానుల మధ్య వార్ కొనసాగితూనే ఉంటుంది. 

అయితే వెంకటేష్ నాగార్జున ల మధ్య చెప్పుకోతగ్గ గ్యాప్ లేక పోయినా ఈ హీరోల  అభిమానుల మధ్య గాప్ ఉందా అని అనిపించే సంఘటన ఈమధ్య జరిగింది. ఈ రెండు కుటుంబాల హీరోలు ఇద్దరూ కలిసి నటించిన 'వెంకీ మామ' సినిమాకు సంబంధించి ఈమధ్య జరిగిన ఫంక్షన్ లో వెంకటేష్‌ ఫ్యాన్స్‌ కట్టిన బ్యానర్స్‌లో ఎక్కడా చైతన్య ప్రస్తావన కనపడలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

అలాగే చైతన్య అభిమానులు కడుతున్న బ్యానర్లలో నాగార్జున అఖిల్‌ ఫోటోలు కనపడుతున్నాయి కానీ వెంకటేష్‌ కి మాత్రం స్థానం అక్కినేని ఫ్యాన్స్ ఇవ్వలేదు అన్న వార్తలు కూడ వచ్చాయి. దీనికితోడు వెంకటేష్ పేరును హైలెట్ చేసేలా ‘వెంకీ మామ’ అన్న టైటిల్ పెట్టడం చైతన్య నాగార్జున అభిమానులకు పూర్తిగా నచ్చలేదు అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. 

దీనికితోడు అక్కినేని ఫ్యామిలీ కూడ ‘వెంకీ మామ’ మూవీ విషయంలో కొంత వరకు సైలెంట్ గా ఉంది అన్న అభిప్రాయం నాగార్జున అభిమానులలో ఉన్నట్లు టాక్. ఇలాంటి రూమర్స్ రావడానికి గల కారణం నాగార్జున అఖిల్ లు ‘వెంకీ మామ’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కనిపించకపోవడం అన్న అభిప్రాయాలు నాగ్ ఫ్యాన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గాసిప్పులలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ప్రచారంలోకి వస్తున్న ఈ గాసిప్పులు ‘వెంకీ మామ’ రిజల్ట్ పై ఫలితం చూపెడతాయా అంటూ ఈ మూవీ బయ్యర్లు కలవర పెడుతున్నట్లు టాక్..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: