గొల్లపూడి మారుతీరావు..తెలియని వారుండరు. నటుడుగా సుపరిచితుడు. ఈయన సుప్రసిద్ధ రచయిత. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయ‌న విశాఖ‌ప‌ట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఏవీఎన్ కళాశాలతో పాటు, ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మారుతీరావు విధ్యాభ్యాసం కొనసాగింది. బీఎస్సీ పూర్తి చేసిన ఈయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా పనిచేశారు. అనంతరం రేడియోలో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్‌ చేరారు.

 

ఇక 1981లో ఆకాశావాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఈయన ఇక్కడ రెండు దశాబ్దాలుగా వర్క్ చేశారు. అసిస్టేంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు గొల్లపూడి. ఆ త‌ర్వాత కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి - మాధ‌వి హీరో, హీరోయిన్లుగా వ‌చ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో గొల్లపూడి వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు మాటల రచయితగా కూడా పనిచేశారు.

 

ఇక ఆయ‌న జీవిత ఘ‌ట్టంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి....
-  1961 నవంబర్ 11న శివకామసుందరితో వివాహం జరిగింది.
- ఈ దంపతులకు ముగ్గురు మగసంతానం. చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ 1992 ఆగస్టు 12న మరణించారు.
- గొల్ల‌పూడి 250 చిత్రాలకు పైగా సహా నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు.
-  కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును నెలకొల్పారు.

 

-  సినీ రచయితగా ఈయన నాలుగు నందీ అవార్డులు దక్కించుకున్నారు.
-  ఏపీ ప్రభుత్వం నుంచి కళారత్నతో పాటు మరెన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు.
-  మనసున మనసై, ప్రజా వేదిక, సినీ సౌరభాలు తదితర కార్యక్రమాలకు ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
-  ప్రేమలు పెళ్లిళ్లు, ఎవరిగోల వారిదే, ఇంటింటి రామాయణం, గణపతి, భార్యారూపవతి శ్రతు, ఏదీ నిజం తదితర సీరియల్స్‌లో నటించి నటుడిగా అలరించారు.
- 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: