2014వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.  అప్పట్లో పార్టీ పెట్టినప్పటికీ పార్టీని ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టకుండా... బయట నుంచి టిడిపి, బీజేపీకి సపోర్ట్ చేశారు.  ఇలా రెండు పార్టీలకు సపోర్ట్ చేయడంతో అప్పట్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.  అయితే, 2019లో ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది.  కేవలం 1 సీటు మాత్రమే విజయం సాధించింది.  


ఇక ఇదిలా ఉంటె, వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  ఇందులో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ డూప్ ను వినియోగించారు.  పవన్ కళ్యాణ్ పేరును డైరెక్ట్ గా వాడలేదు.  అయన పాత్రకు ఎలాంటి పేరు పెట్టలేదు.  అదేవిధంగా, జనసేన పార్టీకి మనసేన అనే పేరు పెట్టి ఓ ఆట ఆడుకున్నాడు వర్మ.  పవన్ కళ్యాణ్ సింబల్ ఎర్ర తువ్వాలను సినిమాలో పెట్టి దానికి ప్రచారం కల్పించాడు.  


ఇక ఎర్ర తువ్వాలతో పాటు జుట్టును సరిచేయడం, పదేపదే ప్రెస్ మీట్ లు పెట్టడం వంటివి కూడా చేస్తూ సినిమాను రక్తికట్టించే విధంగా నడిపించాడు వర్మ.  ఏ పార్టీని వర్మ వదల్లేదు. ప్రతి ఒక్కరిని తనకు కావాల్సిన విధంగా ఆడుకున్నాడు.  ఇక మనసేన పార్టీ అధ్యక్షుడు పదేపదే ప్రెస్ మీట్ పెట్టె విషయాన్ని కూడా ఇందులో చూపించారు.  ఇలా ఇందులో ఎన్నో విషయాలను చూపించి మెప్పించాడు వర్మ. 


వర్మ చేసిన హంగామా అంతాఇంతా కాదు.  ఏంతో కాలం తరువాత వర్మ సినిమా బాగుందనే టాక్ రావడంతో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు.  వర్మ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డు ఉండటం అన్నది జరగని పని.  కానీ, ఈ సినిమాకు మాత్రం హౌస్ ఫుల్ బోర్డు పెట్టడంతో పాటు, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.  దీంతో వర్మ ఖుషి అవుతున్నాడు.  కాగా, రేపు వర్మ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతున్నది.  మరి ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: