రాంగోపాల్ వర్మ..వివాదం తో సంచలనం చేస్తారు. సినిమా తీయడంలో.. దానిని ప్రమోట్ చేయడంలో అయన తరువాతే ఎవరైనా. ఇప్పుడు ఆయన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా విడుదల చేశారు. టైటిల్ దగ్గర నుచీ వివాదాస్పదమైన ఈ మూవీ ఈరోజు విడుదలయింది. ఈ సినిమాలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన ఓ పార్టీతో పాటు.. మ‌రో సినిమా నటుడు స్థాపించిన మరో పార్టీ పై వర్మ ఓ రేంజ్ లో సెటైర్లు వేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

ఇదిలా ఉంటే ఈ సినిమా లో వర్మ కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి క్యారెక్టర్ ను సినిమా ప్రారంభం నుంచి బాగా హైలెట్ చేస్తూ వచ్చారు. గత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ... మాజీ ముఖ్యమంత్రిని అన్నా అన్నా అంటూ రాష్ట్రంలో పార్టీ నాశనం కావడంతో తన వంతు పాత్ర పోషించిన ఆ మాజీ మంత్రి ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ క్రమంలోనే సదరు మంత్రి ని టార్గెట్ చేసిన వర్మమంత్రి పదేపదే ప్రెస్ మీట్ లు పెడుతూ సీఎం జగన్నాథ్ రెడ్డి ని ఎలా విమర్శిస్తారో ? చూపించారు.

 

ట్విస్ట్ ఏంటంటే ఈ మంత్రి తన పార్టీలోనే అందర్నీ డామినేట్ చేస్తూ ఎవ్వరిని ఎదగనీయరు అన్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొంటున్నారు. చివ‌ర‌కు ఆ క్యారెక్ట‌ర్ అయిన ద‌యినేని ర‌మా ఇంట‌ర్వెల్‌లో హ‌త్య‌కు గుర‌వుతాడు. ఆ హ‌త్య‌ను అంద‌రూ ప్ర‌తిప‌క్షాలే చేశాయ‌ని అనుకుంటారు. అయితే క్లైమాక్స్ లో గ‌త సీఎం కొడుకు భార్య అయిన ర‌మ‌ణి (అంటే చిన‌బాబు భార్య పాత్ర పోషించిన ర‌మ‌ణి) ఈ హ‌త్య చేయిస్తుంది. వాడు మీడియాలో అంద‌రిని డామినేట్ చేస్తున్నాడు.. వాడు ఉండ‌కూడ‌ద‌ని చెపుతుంది. దీనిని బ‌ట్టి ఆ మాజీ మంత్రిపై మాజీ సీఎం కుటుంబానికి ఇంత అక్క‌సు ఉందా ? అన్న సందేహాలు వ‌ర్మ రేకెత్తించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: