తను తీసే ఎలాంటి సినిమా అయినా సరే వివాదాలతో హడావిడి చేసే రాం గోపాల్ వర్మ ఏపి రాజకీయ నేపథ్యంతో తెరకెక్కించిన సినిమా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు. ఎన్నో గొడవలతో పూర్తి చేసుకున్న ఈ సినిమా నిన్న సెన్సార్ క్లియరెన్స్ రాగా ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగుస్తాయి.. రాష్ట్ర ప్రజలు తమ సిఎంగా జగన్నాథ్ రెడ్డిని ఎంచుకుంటారు. వెలుగుదేశం పార్టీ, మనసేన పార్టీలు కొత్త సిఎం ను టార్గెట్ చేస్తారు. వెలుగుదేశం పార్టీకి రాజకీయ వారసుడిగా చినబాబుని చేద్దామనే బాబు ఆలోచనలకు విరుద్ధంగా చినబాబు పనులు ఉంటాయి. పార్టీలో కూడా చినబాబు మీద విమర్శలు వస్తాయి. ఈలోగా మాజీ మంత్రి అయినేని రమా హత్య చేయబడతాడు. ఆ హత్యని చేధించేందుకు సిబిఐ ఆఫీసర్లు రంగంలోకి దిగుతారు. ఇంతకీ ఆ హత్య చేయించింది ఎవరు..? చివర్లో ఆర్జివి వచ్చి ఇచ్చిన ట్విస్ట్ ఏంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ :

కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని పెట్టిన ఈ సినిమా టైటిల్ కాస్త అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు. అయితే టైటిల్ ఒక్కటే మారింది కాని సినిమా కంటెంట్ మాత్రం ఆర్జివి సినిమాతో ఏం చెప్పాలని అనుకున్నాడో అది చెప్పాడు. జగన్నాథ్ రెడ్డి సిఎంగా ప్రమాణస్వీకారం చేస్తుంటే చినబాబు గదిలో దూరి కన్నీళ్లు పెట్టుకునే సీన్.. తాను సిఎంగా ప్రమాణ స్వీకారం ఎలా చేయాలో ప్రిపేర్ అయ్యే సీన్ తో వర్మ టార్గెట్ ఎవరన్నది తెలుస్తుంది.

 

సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగా ప్రస్తుతం ఏపి లో అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య జరుగుతున్న గొడవల గురించి వర్మసినిమా చేశాడు. కేవలం ఆ వ్యక్తులను వాడుకుని సినిమా నడిపించాడు. బాబు, చినబాబు, మనసేన అధినేత ఇలా అందరి మీద వర్మ తన కసి చూపించాడు. అయితే సినిమాలో ఇంటర్వల్ ట్విస్ట్ ఎవరు ఊహించలేదు అయినేని రమ హత్య ఆ హత్యను ఎవరు చేయించారన్న సస్పెన్స్ కలిగించాడు.

 

అయితే సెకండ్ హాఫ్ మొత్తం ఆ హత్య ఎవరు చేయించారన్న కథ మీదే నడుస్తుంది. ఇక ఈ సినిమాలో కథ చాలా వీక్ అని చెప్పొచ్చు. కథనం కూడా అంత గ్రిప్పింగ్ గా ఏమి లేదు. అయితే క్లమాక్స్ లో వర్మ సర్ ప్రైజ్ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. చివర్లో ప్రస్తుతం సిఎం భారీ మెజార్టీతో కట్టబెట్టారు.. అతడి నిజాయితీని జనాలు నమ్ముతున్నారో మెజార్టీయే చెప్పింది దాన్ని అందరు అంగీకరించాలని అంటాడు. అప్పటివరకు ఇన్ డైరెక్ట్ గా కథలో పంచులేసిన వర్మ తను కనిపించి సినిమా ఎందుకు తీశాడో చెప్పాడు.

 

నటీనటుల ప్రతిభ :

సినిమాలో నటించిన ప్రతి నటుడికి మంచి పేరు వస్తుంది. నిజ జీవిత పాత్రలను తెర మీద చూపించడం ఒక ఎత్తైతే అలా నటించడం అనేది మరో ఎత్తు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ పర్ఫెక్షన్ చూపించారు. జగన్నాథ్ రెడ్డి పాత్రలో అజ్మల్ బాగున్నాడు. బాబు, చినబాబు, మనసేన అధినేత పాత్రలో కూడా నటించిన వారు మెప్పించారు. స్వప్న, కత్తి మహేష్, అలి వీరు కూడా బాగా చేశారు. కె.ఏ పాల్ గా చేసిన నటుడు కూడా బాగా చేశాడు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

రవి శంకర్ మ్యూజిక్ బాగుంది. బిజిఎం బాగా వచ్చింది. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ మెప్పించింది. టెక్నికల్ గా వర్మ సినిమాకు వేలెత్తి చూపించలేము. సిద్ధార్థ్ తాతోలు, ఆర్జివి కలిసి ఈ సినిమాను బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ :

నటీనటులు

సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

అంచనాలకు తగినట్టుగా లేకపోవడం

సెకండ్ హాఫ్

 

బాటం లైన్ :

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. వర్మ ఏమనుకున్నాడో అది తీశాడు..!

 

రేటింగ్ : 2.5/5 

మరింత సమాచారం తెలుసుకోండి: