ఈ ప్రపంచంలో ఎవరికి భయపడి వ్యక్తి అంటే వర్మ ఒక్కరే అని చెప్పవచ్చూ. ఆయనను తుఫానులు,భూకంపాలు గాని, మనుషులకు దెయ్యాలు చివరికి దేవుడు కి కూడా భయపడ కుండా బతికే ఏకైక జీవి వర్మ అని పేర్కొనవచ్చూ. ఇకపోతే జనాలందరూ బయటకి బూతులు తిడుతున్న కానీ, లోపల మాత్రం ఆడు మగాడ్రా బుజ్జీ..! అని ఆనంద పడుతూ ఉంటారు. దానికి కారణం మామూలు మనుషులు చిరాకు లో ఉన్నప్పుడు, లేదా మందు కొట్టినప్పుడు మాట్లాడుకొని ఫీల్ అయ్యే విషయాలను ఆయన నేరుగా ప్రస్తావించడమే కాకుండా సినిమాలలో కూడా చూపిస్తాడు.

 

 

తీసే ప్రతి సినిమాలో నిజమైన జీవితానికి సంబంధించిన క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లే ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజు అక్కడ ఆ నిమిషంలో ఆ సంఘటన ఎలా జరిగి ఉంటుందో అలానే చూపిస్తాడు. ఇప్పుడు ఇలా చూపించిందే “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” ఇక ఈ సినిమా ఈ రోజు విడుదలై ఫుల్ జోష్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రతి పాత్రను జీవింప చేశాదు రామ్  గోపాల్ వర్మ. ఇక ఇందులో వచ్చే మ‌న‌సేన పాత్ర అచ్చం సమాజంలో జరుగుత్తున్న రాజకీయాలకు అద్దం పడుతుంది.

 

 

ఇకపోతే ఈ పాత్రలో వచ్చే డైలాగ్ చూస్తే నేను సీఎం అయిన రోజున అసెంబ్లీలో నేను త‌ప్ప ఎవ్వ‌రూ మాట్లాడ‌క‌కుండా చ‌ట్టం తెస్తా అని మ‌న‌సేన అధినేత ప్రెస్‌మీట్ పెట్టి చెపుతాడు... ఇలా ఎందుకంటే అసెంబ్లీలో సంఘ‌ట‌న‌లు ఆయ‌న్ను బాధించాయంట .. అందుకే ఆయ‌న సీఎం అయ్యాక ఆయ‌న త‌ప్ప అసెంబ్లీలో ఎవ్వ‌రూ మాట్లాడ‌కుండా చ‌ట్టం తెస్తాడ‌ట‌. ఇదే కాకుండా మ‌న‌సేన ఎమ్మెల్యే మాట్లాడుతూ చివ‌ర‌కు ఓ పేప‌ర్ మీద స్లిప్ తీసుకువ‌చ్చి అందులో రాసుకువ‌చ్చి చ‌దువుతాడు.. ఎందుకంటే మ‌న‌సేన ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో తెలియ‌దు కాబట్టి... నా పార్టీలో నేనే నెంబ‌ర్ వ‌న్ని ప‌దే ప‌దే అదే డైలాగ్ వేస్తాడు.. ఇందులో కనిపించే ప్రతి పాత్ర ఒక వ్యంగమైన రీతిలో మలిచాడు వర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి: