సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు ఎట్ట‌కేల‌కు ఎన్నో వివాదాలు దాటుకుని ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఈ సినిమాపై ముందు నుంచి ఓ వ‌ర్గం అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. సినిమా రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా ఆ వ‌ర్గం అభిమానుల‌ను చాలా వ‌ర‌క సంతృప్తి ప‌రిచేలా వ‌ర్మ అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమాను తెర‌కెక్కించాడ‌నే చెప్పాలి.

 

ఇక సినిమాలు విజిల్స్ వేసే సీన్లు చాలానే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఎలా అరుచుకుంటున్నారో ?  గ‌తంలో ఎలా పేప‌ర్లు విసురుకున్నారో ?  ఎలా బండ బూతులు తిట్టుకున్నారో ? ఆ క్యారెక్ట‌ర్ల‌ను చ‌క్క‌గా చూపించాడు. అలాగే అసెంబ్లీ సీరియ‌స్ గా న‌డుస్తుంటే ఓ వైపు స్పీక‌ర్ క్యారెక్ట‌ర్ నిద్ర పోవ‌డాన్ని బ‌ట్టి చూస్తే వ‌ర్మ ఎవ‌రి మీద సెటైర్ వేశాడో స్ప‌ష్టంగా తెలుస్తుంది.

 

ఇక ప్ర‌తిప‌క్ష నేత, వెలుగుదేశం అధినేత బాబు సీరియ‌స్‌గా  చూస్తుంటే.. సీఎం క‌ళ్లు పెద్ద‌వి చేసి చూస్తే ఇక్క‌డ ఎవ్వ‌రు భ‌య‌ప‌డ‌రు అన్న డైలాగ్‌కు కంటిన్యూగా విజిల్స్ ప‌డ్డాయి. మ‌రో కామెడీ ఏంటంటే సీఎంగా జ‌గ‌న్నాథ్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేస్తుంటే .. ప్ర‌తిప‌క్ష నేత బాబు కుమారుడు చిన‌బాబు టీవీలో సీఎం ప్ర‌మాణ‌స్వీకారం చూస్తూ ఇంట్లోకి వెళ్లి చిన‌బాబు అనే నేను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్నాను అని ఏడుస్తుంటే బాబు, చిన‌బాబు భార్య ర‌మ‌ణి ఓదార్చ‌డం హైలెట్‌.

 

ఈ సీన్‌కు థియేట‌ర్ల లో ప్రేక్ష‌కులు క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్వారు. అలాగే మ‌న‌సేన అధినేత క‌ళ్యాణ్ అంటూ ప‌దే ప‌దే చేయి పైకి చూపుతూ.. ఓ ఎర్ర తుండు మెడ‌లో వేసుకున్న పార్టీ అధినేత‌ను కూడా వ‌ర్మ బాగా సెట‌ర్ల‌తో ఆడుకున్నాడు. సినిమాలో ఎన్ని సైటర్ల సీన్లు ఉన్నా చిన‌బాబు టార్గెట్గా వ‌ర్మ వేసిన సెటైర్లే హైలెట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: