వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా రామ్ గోపాల్ వర్మసినిమా గురించి ప్రకటన చేసిన రోజు నుండి ఎన్నో సంచనలనాలకు కారణమైంది. కొన్ని రోజుల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలు ఏర్పడటంతో ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆంధ్ర రాష్ట్రంలో రెండు పార్టీలపై వర్మ మార్క్ సెటైరికల్ మూవీగా తెరకెక్కింది. 
 
ప్రముఖ క్రిటిక్ కత్తి మహేశ్ బుల్లెట్ రమేశ్ పాత్రలో ఈ సినిమాలో నటించాడు. అయినేని రమా హత్య కేసులో సీబీఐ ఆఫీసర్ గా బుల్లెట్ రమేష్ ఎంట్రీ ఇస్తాడు. బుల్లెట్ రమేష్ ను అయినేని రమాను మాజీ ముఖ్యమంత్రి బాబు హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి అని ప్రశ్నించగా మాకు ఎవరు హత్య చేశారో తెలుసని నేను ఎవరు హత్య చేశారో మాత్రం చెప్పనని చెబుతూ సీరియస్ రోల్ లో కామెడీ చేస్తూ ఉంటారు. బుల్లెట్ రమేష్ పాత్రలో కత్తి మహేష్ ఓబుల్ రెడ్డిని పట్టుకుంటానని చెబుతూ... ఎక్కడ ఉన్నాడు ఓబుల్ రెడ్డి అని అడిగితే మళ్లీ తప్పించుకున్నాడని చెబుతూ ఉంటాడు. 
 
సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోయినా వర్తమాన రాజకీయాలపై అవగాహన ఉన్నవారిని ఈ సినిమా ఆకర్షిస్తుంది. రామ్ గోపాల్ వర్మ పాత్రల పేర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు పాత్రలను పోలిన వ్యక్తులు సినిమాలో ఉండటం సినిమాకు ప్లస్ అయింది. వెలుగుదేశం, మనసేన ఇలా ప్రముఖ పార్టీల పేర్లతో ప్రతి విషయంలో అధికార పక్షంపై విమర్శలు చేసేలా వర్మ సినిమాలో చూపించాడు. 
 
బాబు, చినబాబు పాత్రలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. వర్మ సినిమాల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా బెటర్ మూవీ అని చెప్పవచ్చు. క్లైమాక్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచింది. కథ, కథనాల విషయంలో వర్మ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మాత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా మరో లెవెల్ లో ఉండేది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: