కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’  సినిమా అనేక వివాదాల నడుమ తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో అనేక సమస్యలను జయించి న్యాయస్థానం దాకా వెళ్లి తాజాగా ఈ రోజు విడుదల అవ్వడం జరిగింది. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయిన తరువాత చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ముఖ్యంగా సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలిన పాత్ర హైలెట్ అని మరియు అదే విధంగా చంద్రబాబు ని పోలిన పాత్ర నటించిన వ్యక్తి కూడా చాలా బాగా నటించాడని సినిమా చూసిన ప్రేక్షకులు అభినందిస్తున్నారు. మరోపక్క సినిమా చూసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అద్భుతంగా తెరకెక్కించినట్లు ఎక్కడా కూడా ఎవరినీ కించపరిచే విధంగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’  సినిమా లేదని అద్భుతంగా తెరకెక్కించారని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

 

అయితే సినిమాలో  జగన్ రెడ్డి అనే వ్యక్తి భారీ మెజార్టీతో ఎన్నికలలో గెలవడంతో ఆఖరి నిమిషంలో జాఫర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని క్లైమాక్స్ సీన్ లో ఇంటర్వ్యూ చేయడం. ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వేసిన డైలాగులు సినిమా మొత్తానికి హైలెట్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. విషయంలోకి వెళితే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ని పోలిన పాత్ర నాయకుడు పార్టీ ఏకంగా 175 స్థానాలలో 174 స్థానాలు గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించడం పట్ల చివరిలో ఎన్నికల ఫలితాలు వచ్చాక స్టూడియోలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో జాఫర్ ఇంటర్వ్యూ చేసిన సన్నివేశంలో ….డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నీ ఎందుకు మీరు బాబోరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతారు అదేవిధంగా జ‌గ‌న్నాథ్‌రెడ్డి పార్టీకి అనుకూలంగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించగా.

 

ఈ ప్రశ్నకి సమాధానం జ‌గ‌న్నాథ్‌ రెడ్డి అనే వ్యక్తికి నేనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా తమ ఓట్ల రూపంలో సపోర్ట్ గా నిలిచారు అది అతని నిజాయితీకి నిదర్శనం నాకు ఏ పార్టీ ఏ వ్యక్తి అయినా ఒకటే అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చివరి క్షణంలో సినిమాల్లో జగన్ ని పోలిన క్యారెక్టర్ జ‌గ‌న్నాథ్‌ రెడ్డి కి అనుకూలంగా డైలాగులు వేయడంతో సినిమా హాల్లో ప్రేక్షకులు గోల గోల విజిల్స్ వేస్తున్నారు అని ఇది చంద్రబాబు చూస్తే చలికాలంలో బాబు గారికి చలిజ్వరం రావడం గ్యారెంటీ అని అంత రెస్పాన్స్ సినిమా హాల్లో జ‌గ‌న్నాథ్‌ రెడ్డి గెలిచిన సన్నివేశానికి వచ్చిందని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: