టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది. మరో దృవతార నేలరాలింది. కళారత్న... గొల్లపూడి మారుతీరావు కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన గొల్లపూడి మారుతీరావు ఇకలేరు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన చివరి శ్వాస విడిచారు .

 

250కి పైగా చిత్రాల్లో గొల్లపూడి నటించారు. గొల్లపూడి మరణవార్తతో సినీ ఇండస్ట్రీ లో  విషాద ఛాయలు నెలకొన్నాయి. నటీనటులు గొల్లపూడి తో  ఉన్న తమకు  అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు.  సినీ ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది అని  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 

ఈయన పూర్తీ పేరు గొల్లపూడి మారుతీరావు కానీ అందరు ఈయన గొల్లపూడి అని మాత్రేమే పిలిచేవారు ఈయన 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జిల్లాలో పుట్టారు   ఈయనకు  చిన్నతనం నుంచే కళారంగం  పైన ఆసక్తి ఉండేది ఆ దిశ వైపు అడుగులు వేశారు. ఆయన చదువుకునే  రోజుల్లోనే నవలలు, నాటకాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా  తోలి పరిచయం అయ్యారు. సినిమాల్లోకి రాకముందు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రయోక్తగా , జర్నలిస్ట్‌గా  కూడా ఆయన కొంతకాలం పనిచేశారు.

 

దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి ఆరు నంది అవార్డులు అందుకున్నారు. టెలివిజన్‌ రంగంలోనూ తనదైన  నటన శైలి తో  చెరగని  ముద్ర వేసుకున్నారు  ఆయన   గొల్లపూడి మృతితో ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కును కొల్పోయినట్లయ్యింది. ఈ ఆయన మృతి పట్ల యావత్‌ సినీ పరిశ్రమ  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు గొల్లపూడి మారుతీరావు మృతికి సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: