వర్మ అంటే తెలియని వారు అతన్ని పిచ్చోడు క్రింద జమ కడుతారు. అతని గురించి పూర్తిగా అర్దం అయిన వారు మాత్రం అతన్ని జ్ఞానిగా చూస్తారు. లోకం తీరును బాగా ఒంట పట్టించుకున్న వర్మ ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలానే ప్రవర్తిస్తాడు. ఇకపోతే కత్తి అయినా అప్పుడప్పుడు పదును తగ్గుతుందేమో గాని వర్మ మాత్రం తన మెదడును ఎప్పుడు పదునుగానే ఉంచుతాడనిపిస్తుంది. ఎందుకంటే అతని ఆలోచనల్లొ నుండి పుట్టె మాటలు ఎప్పుడు బుల్లెట్లా ఎవరిని తాకుతాయో చెప్పడం చాలా కష్టం.

 

 

ఇకపోతే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏదో కొత్తగా రాజకీయ నాయకుల బయోపిక్ లు అంటూ మొదలు పెట్టలేదు. తన మొట్టమొదటి సినిమా శివ లోనే విలన్ పేరు భవాని అనే పేరుకి ఇన్స్పిరేషన్ గా అప్పట్లో విజయవాడలో సంచలనం సృష్టించిన పెద్ద రాధా గారి పేరును వాడుకున్నాడు. అదే శివ సినిమాలో శుభలేఖ సుధాకర్ చనిపోయే సీన్ కి ఇన్స్పిరేషన్, ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ గారి తమ్ముడు దేవినేని మురళి హత్య ఉదంతమే. ఎలా అయితే…, చిలకలూరి పేట పరిసర ప్రాంతాల్లో ఆయన హత్య జరిగినప్పుడు నిందితులు ఆయన్ని ఎలా అయితే వెంటాడి చంపారో ఆ సన్నివేశం కూడా అలాగే ఉందని అప్పట్లో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అన్నట్లు వార్తలు ఉన్నాయి.

 

 

ఇకపోతే ఇప్పుడు వచ్చిన తాజా సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. ఇకపోతే మ‌న‌సే గెలుస్తుంది అంటూ మ‌న‌సేనాని ప్ర‌సంగాన్ని ఆడుకున్న వ‌ర్మ నాకు సినిమాలు పెద్ద  లెక్క కాదు.. మీ కోసం సినిమాలు వ‌దులుకుంటాను... అంటూ ప‌వ‌న్ ప్ర‌సంగం గురించి సెటైర్లు వేశాడు సేమ్ మెడ‌లో ఎర్ర తువ్వాలు.. గెడ్డం . ఆ గెట‌ప్‌ ను అలాగే దించేశాడు.

 

 

ఇక  రామ్ గోపాల్ వర్మ ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పాడు కానీ సినిమా లోని ప్రధాన పాత్రల దగ్గరనుండి ప్రతి చిన్న పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పాత్రలనే గుర్తుకుతెస్తాయి. రూలింగ్ లో ఉన్న వెలుగు దేశం పార్టీని మట్టికరిపించి విఎస్ జగన్నాథరెడ్డి కి చెందిన పార్టీ అధికారం లోకి వస్తుంది. అయితే ఆ తర్వాత నుండి రాజకీయ పరిస్థితులు మారి వెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని రమ హత్యకు గురవుతాడు. ఆ హత్యతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయి? మధ్యంతర ఎన్నికలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? దాని తర్వాత పర్యవసానాలు ఎలా సాగాయి అన్నది మిగిలిన కథ. 

మరింత సమాచారం తెలుసుకోండి: