సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ... దానిని సినిమా తీసేందుకు తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వ‌ర్మ‌కు వ‌ర్మే సాటి. గత కొన్ని సంవత్సరాలుగా వ‌ర్మ‌ హైదరాబాద్లో మకాం వేసి తెలుగు రాజకీయాలను బాగా వంట ప‌ట్టించుకోవ‌డంతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న‌ వర్తమాన... రాజకీయ పరిస్థితులను బాగా ఆక‌లింపు చేసుకుని.. వాటినే తన సినిమాలకు కథలు మార్చుకుంటున్నాడు.

 

ఆర్జీవీ కల్పిత పాత్రలు, కల్పిత కథకి మన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిస్థితులకి భలే దగ్గర పోలికలు ఉన్నాయి, చెప్పాలంటే ఈ సినిమాలో ఫ‌స్టాఫ్ సీన్లు మక్కికి మక్కి కాపీ కొట్టినట్టు ఉంటుంది. అదే ఈ సినిమాకి ప్రేక్షకులు రావడానికి ఉపయోగపడిన మొదటి ప్లస్ పాయింట్. అలాగే ఆ పాత్రలకి ఎంచుకున్న నటులు, నిజ జీవిత పాత్రలకి జెరాక్స్ కాపీలా ఉండడం కూడా ప్లస్ అయ్యింది. ఇక సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే పప్పు సాంగ్ లోని కొన్ని మోమెంట్స్ నవ్విస్తాయి. పాల్ రోల్ పై తీసిన సాంగ్ కూడా బాగుంది.

 

ఇక ఇంటర్వల్ బ్లాక్ అయిన దేవినేని రమ మర్డర్ సీన్ బాగుంది. కెఏ పాల్ స్ఫూర్తిగా కనిపించే పిపి చాల్ పాత్ర సెకండాఫ్ లో నవ్విస్తుంది. ఈయన రెండు మూడు సన్నివేశాలే సెకండాఫ్ లో రిలాక్సింగ్ గా అనిపిస్తాయి. ఇక చిన‌బాబు రోల్ చేసిన వ్యక్తి హ‌వ‌భావాలు... గుక్క ప‌ట్టి ఏడ్వ‌డం.. చివ‌ర‌కు భార్య‌, పిల్లాడితో సెల్ఫీ తీసుకోవ‌డానికి కూడా ప‌డే ఇబ్బందులు, అటు మ‌న‌సేన అధ్య‌క్షుడు చేయి ఊపుకుంటూ చేసే హ‌డావిడి.. ఆయ‌న జుట్టు స‌రి చేసుకోవ‌డం ఇవ‌న్నీ సినిమాలో సిటీమార్ పాయింట్సే. ఈ సీన్లు వ‌చ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో కంటిన్యూగా న‌వ్వ‌డంతో పాటు, విజిల్స్ వేస్తూనే ఉన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: