రామ్ గోపాల్ వర్మ పెద్ద హీరోలను నమ్ముకోకుండా కేవలం సినిమాకి పనిచేసిన టెక్నిషియన్ కి మాత్రమే గుర్తింపు రావాలి అన్న లక్ష్యంతో ఇప్పటి వరకు క్రైమ్, మాఫియా, హర్రర్, టెర్రరిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలా ప్రతి జోనర్ లోనూ సినిమాలు చేశాడు. జనాలు గుంపులు గుంపులుగా కూర్చుని గుసగుసలు గా మాట్లాడుకునే రాయలసీమ ఫ్యాక్షన్ కథలను రక్తచరిత్ర రూపంలో తీసి చూపించాడు.

 

 

ఆ తర్వాత రిలీజ్ అయిన వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా, యదార్థంగా జరిగిన సంఘటనలను చూపించాడు. తాజాగా ఇప్పుడు “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” గా టైటిల్ మార్చుకుని ఈ రోజు ధియోటర్లోకి వచ్చాడు.  ఇకపోతే బాబోరి 40 ఏళ్ల రాజకీయ చరిత్రను బండకేసి బాదేసిండు వర్మ ఈ సినిమాలో.. ఆంధ్రప్రదేశ్ ను మొత్తం 14 సంవత్సరాలు  పాలించిన బాబు గారు, చివరకు వచ్చిన ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. ఓటమి తర్వాత బాబు గారి భజన చేసే రాజకీయ నాయకులు ఒక బ్యాచ్ గా బాబు గారిని భరించలేని నాయకులు మరిక బ్యాచ్ గా విడిపోతారు.

 

 

ఇలా విడిపోయిన వాళ్ళు అధికార పార్టీలో కి వెళ్దాం అంటే..? అధికార పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఆయన పార్టీ లోకి వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లక తప్పదు. మరి ఈ పరిస్థితుల్లో గతంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి తన పిల్లనిచ్చిన మామను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తాడు. ఇదే కాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించి రాష్ట్రంలో అల్లకల్లోలం రేపడానికి పూనుకుంటాడు బాబు గారు. ఇక ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకోవడానికేం లేదు. ఎందుకంటే ఇందులో ఎవరి గురించి చెప్పాలన్నా నటించారు అని చెప్పడానికి లేదు. బాగా ఇమిటేట్ చేసారు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: