మెగా స్టార్ చిరంజీవి నటించిన  పీరియాడికల్ మూవీ  సైరా  ఈ దసరా కు  విడుదలై   పాజిటివ్  రివ్యూస్  తో పాటు మంచి  టాక్ ను  కూడా  తెచ్చుకొని  తెలుగు రాష్ట్రాల్లో  సూపర్  హిట్  అనిపించుకుంది. ఇక  ఈచిత్రాన్ని  తెలుగు తోపాటు  హిందీ , తమిళ , మలయాళ , కన్నడ  భాషల్లో  విడుదలచేశారు. కానీ  ఒక్క తెలుగు , కన్నడ లో తప్ప  మిగితా  మూడు  భాషల్లో  భారీ  పరాజయాన్ని మూటగట్టుకుంది. 
 
 
అయితే  తాజాగా కోలీవుడ్ లో మాత్రం  సైరా తమిళ వెర్షన్   టిఆర్పి రేటింగ్స్  లో  రికార్డు సృష్టించింది.  ఈచిత్రాన్ని గత వారం సన్ టీవి ప్రసారం చేయగా  ఏకంగా  15.42 రేటింగ్స్ ను రాబట్టుకొని  అత్యధిక  రేటింగ్స్ ను రాబట్టిన  తెలుగు డబ్బింగ్ సినిమాగా   రికార్డు సృష్టించింది.  ఇటీవలే ఈచిత్రం  సౌత్ లోని అన్ని భాషల్లో  అమెజాన్ ప్రైమ్ లో  విడుదలైయింది.  అయినా కూడా  ఈరేంజ్ లో రేటింగ్స్ ను రాబట్టుకోవడం గొప్ప విషయమే.  కాగా  ఈచిత్రాన్ని  థియేటర్లలో  చూడడానికి  ఇష్టపడని తమిళ ప్రేక్షకులు  బుల్లితెర పై బ్రహ్మరథం పట్టారు.  తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు  ఉయ్యాలవాడ  నర్సింహారెడ్డి  జీవిత కథ  ఆధారంగా  సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో  అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , సుధీప్ , నయనతార ,తమన్నా వంటి భారీ స్టార్ క్యాస్టింగ్ నటించింది. 
 
 
ఇక ఈ చిత్రం తరువాత చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్  కొరటాల శివ  తో  తన 152 వ చిత్రాన్ని చేయనున్నాడు. ఇటీవలే ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ కూడా అయ్యింది.  ప్రస్తుతం  ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్  జరుగుతున్నాయి.  మ్యాట్నీ ఎంటర్ టైమెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్స్  నిర్మించనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: