కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపుతున్న సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ తెర‌కెక్కించిన సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. తన శిష్యుడు తాతోలు సిద్ధార్థ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ముందుగా క‌మ్మ‌ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు టైటిల్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ టైటిల్ చుట్టూ తీవ్ర వివాదాలు ముసురు కోవడంతో టైటిల్‌ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డ‌లు గా మార్చారు.



ఇక ఈ సినిమా చుట్టూ కావాల్సినన్ని వివాదాలు నెలకొనడంతో ప్రేక్షకులు తొలిరోజు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న లీడింగ్ రాజకీయ నాయకులు అందరి రూపురేఖలు హావభావాలు అలా దించేశారు. ఈ క్రమంలోనే వాళ్ళు కనపడినప్పుడు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్టాఫ్ వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రపంచ శాంతి పార్టీ అధినేత క్యారెక్టర్ ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయేలా డిజైన్ చేశారు. పాత్రధారుల ఎంపిక పై పెట్టిన శ్రద్ధ సగం అయినా స్క్రిప్టుపై పెట్టి ఉంటే కచ్చితంగా సినిమా రేంజ్‌ వేరే విధంగానే ఉండేది.



ఇంటర్వెల్ కు ముందు వరకు మనందరికీ తెలిసిన రాజకీయాలనే చూపించిన వర్మ ప్రతి ఒక్కరిని సినిమాలో లీనం చేశాడు. ఇంటర్వెల్లో హత్యతో ట్విస్ట్ ఇచ్చాడు. అక్కడ్నుంచి దాన్ని చుట్టూనే క‌థ న‌డ‌పాల‌ని పూర్తిగా క‌థ డైవ‌ర్ట్‌ చేశాడు. దీంతో సెకండాఫ్ ఫేల‌వంగా మారింది. సినిమా లో ఏం జరుగుతుంది అనే ఆసక్తి లేకుండా పోయింది.



క్లైమాక్స్లో ద‌య‌నేని రమా హత్యను ఎవరో చేస్తారు ? అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తే.. దానిని ఓ రాజకీయ హత్య గా చూపించారు. ఆ హ‌త్య చుట్టూ అల్లుకొన్న డ్రామా పండక పోవడంతో ఫైనల్ గా.. అమ్మ‌ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా వర్మ తెరకెక్కిస్తున్న ఓ నాసిర‌కం సినిమాగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: