విడుదలకు ముందే సెన్సార్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొన్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఈరోజు విడుదలైంది. ఈరోజు విడుదలైన ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను వర్మ కామెడీ చేశాడు. ఏ రాజకీయ నాయకులను ఉద్దేశించి తాను ఈ సినిమాను తీయలేదని చెప్పిన వర్మ బాబు, చినబాబు పాత్రల్ని సెటైరికల్ గా ప్రజెంట్ చేశాడు. ముఖ్యంగా బాబు, చినబాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. 
 
బాబు, చినబాబు పాత్రలు మంచి వినోదాన్ని పంచాయి. క్లైమాక్స్ లో వెలుగుదేశం పార్టీ తరపున బాబు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచినట్లు చూపించి వర్మ ఈ సినిమాను ఇందులో బాబు పాత్రను ఎంత వినోదాత్మకంగా చూపాడో చెప్పకనే చెప్పాడు. బాబు పాత్రలో నటించిన నటుడు కాస్త బిగుసుకుపోయినట్లు అనిపించినా చూడటానికి బాబులాగానే ఉండటం ప్లస్ అయింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు బాబు మీద కసి తీర్చుకోవడానికే వర్మసినిమా తీశాడా అనే ప్రశ్న మెదులుతుందంటే ఆశ్చర్యం లేదు. 
 
సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జగన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పిచ్చగా నచ్చుతుంది. కానీ బాబు పాత్రపై, లోకేశ్ పాత్రమే సెటైర్ మోతాదుకు మించి సాగుతుంది. సీబీఐ ఆఫీసర్ పాత్రలో కత్తి మహేశ్, సిట్ ఆఫీసర్ గా స్వప్న, స్పీకర్ పాత్రలో అలీ, చినబాబు పాత్రలో ధీరజ్, మనసేన అధినేత పాత్రలో నటించిన వ్యక్తి, పీపీ జాల్ పాత్రలో నటించిన వ్యక్తి పాత్రలకు తగినట్లుగా నటించారు. 
 
స్లోగా సాగే సన్నివేశాలు సినిమాకు మైనస్ గా మారాయి. క్లైమాక్స్ కొంతమంది ప్రేక్షకులకు రుచిస్తే కొంతమంది ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సంగీత దర్శకుడు రవి శంకర్ అందించిన సంగీతం బాగుంది. చంద్రబాబును మాత్రం ఈ సినిమాతో వర్మ రియల్ కామెడీ పొలీటీషియన్ గా మార్చేశాడనే అభిప్రాయాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: