నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో `రూలర్‌` అనే సినిమా చేయడం జరిగింది. వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు తర్వాత బాలకృష్ణ నటించిన `రూలర్‌` సినిమాపై నందమూరి అభిమానులు అంచనాలు చాలానే పెట్టుకున్నారు. అంతే కాకుండా సినిమాకి సంబంధించి బాలకృష్ణ ఫోటోలు మొదటిలో సోషల్ మీడియాలో రావడంతో ఫోటోలో బాలయ్య బాబు అదరగొట్టే లుక్ లో చాలా స్లిమ్ గా కనిపించిన నేపథ్యంలో సినిమా గ్యారెంటీ హిట్ మళ్లీ బాలయ్య సూపర్ హిట్ ట్రాక్ ఎక్కడం గ్యారెంటీ అని అనుకోవటం జరిగింది. అయితే తాజాగా `రూలర్‌` సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన తర్వాత నందమూరి అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో `రూలర్‌` పై ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

 

మరియు అదే విధంగా `రూలర్‌` సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంతమాత్రంగా సాగినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. దీంతో నందమూరి అభిమానులు బోయపాటి తో తీయబోయే బాలకృష్ణ సినిమాపై ఇప్పటినుండి అంచనాలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడంతో… తాజాగా మొదలు కాబోతున్న మూడవ సినిమా పై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఇప్పటినుండి పెట్టుకుంటున్నారు.

 

మరోపక్క బాలకృష్ణతో హ్యాట్రిక్ విజయం సాధించడానికి బోయపాటి భారీ బడ్జెట్ కి తగ్గ స్టోరీ తో పాటు బాలకృష్ణ పక్కన హీరోయిన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ 'దబాంగ్' సినిమాతో మంచి క్రేజ్ దేశవ్యాప్తంగా క్రియేట్ చేసుకున్న సోనాక్షి సిన్హా ను బాలయ్య కోసం బోయపాటి బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి తీసుకు రాబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. ఈ నేపథ్యంలో సోనాక్షి సిన్హా తో సినిమా యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో బలంగా వార్తలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: