డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతూ సక్సెస్ ఫుల్ గా సినిమా హాల్లో రన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యంలో 2019 ఎన్నికల అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మసినిమా తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీని గానీ మరియు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని గాని కించపరిచే విధంగా సినిమా లో ఎటువంటి సన్నివేశాలు లేవని అందరిని అలరించే విధంగా రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా తెరకెక్కించారని సినిమా అద్భుతమని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సినిమా 'శివ' తర్వాత  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా మాత్రమే అని సినిమా చూసిన ప్రేక్షకులు బయట హాల్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ దర్శకత్వం కి తిరుగులేదని రామ్ గోపాల్ వర్మ ఇస్ బ్యాక్ అంటున్నారు.

 

ముఖ్యంగా సినిమాలో లోకేష్ పాత్ర ని పోలిన పాత్ర మరియు అదే విధంగా కె.ఎ.పాల్ పోలిన పాత్ర సినిమాకే హైలెట్ అని అదిరిపోయే కామెడీ రెండు క్యారెక్టర్లతో సినిమా హాల్ కు వచ్చిన ఆడియన్స్ కి రామ్ గోపాల్ వర్మ ఫుల్ గా ఇచ్చాడని సినిమా సూపర్ అని అంటున్నారు. అందరికంటే సినిమా జగన్ ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతుందని ఖచ్చితంగా ఈ సినిమా పదిసార్లు చూడటం గ్యారెంటీ అని.. సినిమా చూసిన ఆడియన్స్ అంటున్నారు.

 

విషయంలోకి వెళితే పవర్ లో జగన్నాథరెడ్డి అనగా జగన్ పోలిన పాత్ర జగన్నాథరెడ్డి...అధికారంలో ఉన్న సమయంలో అపోజిషన్ పార్టీ నాయకుడు హత్య చేయబడతాడు అని.. దీంతో ఆ మరక జగన్నాథరెడ్డి ప్రభుత్వంపై పడటంతో ….వాటి పరిణామాల వల్ల జగన్నాథరెడ్డి తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి భారీ మెజార్టీతో మళ్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించడం దాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జగన్ అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకొనేలా చిత్రీకరించడం జరిగిందని… ఆ ట్రాక్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అని ఖచ్చితంగా జగన్ అభిమానులు ఆ ఎపిసోడ్ కోసం పది సార్లు అయినా  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా చూస్తారని సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకి జగన్ పోలిన పాత్ర జగన్నాథరెడ్డి క్యారెక్టర్ హైలెట్ అని చాలామంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: