రామ్ గోపాల్ వర్మ సిద్ధం చేసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  సినిమా రిలీజ్ తరువాత మంచి టాక్ సొంతం చేసుకుంది.  సినిమాకు మొదట టైటిల్ అనుకున్నప్పటి నుంచి సినిమా వార్తల్లోకి వచ్చింది.  వార్తల్లోకి రావడమే కాదు... సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా నెలకొన్నది.  ఇక ఇదిలా ఉంటె, ఇందులో దయనేని రమ అనే పాత్రను వర్మ తీర్చి దిద్దిన విధానం అద్బుతంగా ఉందని చెప్పాలి.  వర్మ ఈ పాత్రను స్పెషల్ గా ట్రీట్ చేశారు.  


వర్మ ఈ పాత్రను మలిచిన విధానం గాని, ఆ పాత్ర హత్యకేసులో ఇచ్చిన ట్విస్ట్ గాని అద్భుతంగా ఉంటుంది.  చాలాకాలం తరువాత వర్మ తన క్రియేటివిటీని వినియోగించాడు.  సినిమాకు ప్రాణం పోశాడు. విజయవాడ రాజకీయాలను బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా సూపర్ గా ఉంది.  రాజకీయాల్లో విజయవాడ ఎందుకు అంత హాట్ హాట్ గా ఉంటుందో ఈ సినిమా ద్వారా చెప్పారు.  


ఇక ఇదిలా ఉంటె, చంద్రబాబు గురించి వర్మ ఏకిపారేసాడు.  ఒక్క బాబునే కాదు, లోకేష్, మనసేన ఇలా ఎవరిని కూడా వర్మ వదిలిపెట్టలేదు.  మరోవైపు పాల్ పాత్రను మలిచిన విధానం కూడా బాగుంది.  పాల్ పాత్రను అద్భుతంగా తీర్చి దిద్దాడు వర్మ.  జగన్నాథ్ రెడ్డిగా నటించిన వ్యక్తి ఆ పాత్రకు ప్రాణం పోశాడనీ చెప్పొచ్చు.  ఇకపోతే, సినిమాను వర్మ ఒక ఫన్ గా తీసుకోవాలని చెప్పడం బాగానే ఉన్నా.. ఆ పాత్రలు ఎవరి గురించి తీస్తున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి, వాటిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం.  


ఇక ఇదిలా ఉంటె, సినిమాలో చాలా వరకు ట్విస్ట్ లు పెట్టుకుంటూ. ఒక పాత్రకు మరొక పాత్రకు లింక్ పెట్టుకుంటూ వర్మ సినిమాను నడిపిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  మొత్తానికి వర్మ తన సినిమా ద్వారా మరలా అద్భుతాలు చేశారు.  అద్భుతమైన సినిమాలు చేసి తిరిగి పైచేయి సాధించారని చెప్పొచ్చు.  మొన్నటి వరకు వర్మ సినిమా అంటే ఎదో హడావుడి ఉంటుంది, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన జనాలు, ఇప్పుడు వర్మ సినిమాకు ఎట్రాక్ట్ అవుతున్నారు.  భేష్ కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: