అసలు `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` అనే చిత్రం రిలీజవుతుందా లేదా? ఈ మూవీ విడుదల చేయడానికి ఆర్జీవీకి లైన్ క్లియరైనట్టేనా?  సినిమా (డిసెంబర్ 12) రిలీజ్ అంటూ ప్రకటించి ఇంకా ఏమిటీ గోల.. అస‌లు విడుద‌ల‌వుతుందా అని అనుకునేలోపే సెన్సార్ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. ఈ రోజు విడుద‌లైంది.

 

వ‌ర్మ తీసే సినిమాలు కేవ‌లం వివాదం సృష్టించడానికే అన్నట్టు ఎవ్వరూ టచ్ చేయని కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ.. అందరి నోళ్లలో నానుతాడు. సినిమాను ప్రమోట్ చేయడం ఎలాగూ, టైటిల్‌తోనే గొడవలు ఎలా పెట్టగలడో అనే వాటిపై రీసెర్చ్ చేసినట్టుకనిపిస్తోంది. చిత్రంలో ఉన్న అభ్యంతరాలు అన్ని తీసేసామని చిత్రయూనిట్ కోర్టుకు విన్నవించుకున్నారు. వాళ్లు చెబుతున్నట్టు ఏదీ తీసి వేసినట్టు ఎక్కడా లేదని కేవలం మ్యుట్‌లో మాత్రమే ఉంచారని సెన్సార్ బృందం వ్యాఖ్యానించింది. 

 

ఇక ఇదిలా ఉంటే సినిమా విష‌యానికి వ‌స్తే వ‌ర్మ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుల‌ను మాములా ఏక‌లేదు. బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, కేఏపాల్ ఇలా ఎవ‌రెవ‌రైతే ఉన్నారో అంద‌ర్నీ క‌లిపి ఆడేసుకున్నాడు. ఇక ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడి  విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌భుత్వంలో చేసిన త‌ప్పులను ఎండ‌గ‌డుతూ అలాగే లోకేష్‌ను ఎందుకు ప‌నికిరాని ప‌ప్పులాగా చూపిస్తూ సెటైరిక‌ల్ కామెడీ లాగా తీశారు. దీనికి జ‌నం థియేట‌ర్‌లో క‌డుపు చ‌క్క‌ల‌య్యేలా న‌వ్వుతున్నారు.  రూలింగ్ లో ఉన్న వెలుగు దేశం పార్టీని మట్టికరిపించి విఎస్ జగన్నాథరెడ్డి(అజ్మల్ అమీర్)కు చెందిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఆ తర్వాత నుండి రాజకీయ పరిస్థితులు మారి వెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని రమ హత్యకు గురవుతాడు. ఆ హ‌త్య కూడా వెలుగుదేశం పార్టీలోని ప్ర‌ధాన నాయ‌కుడి కారు డ్రైవ‌ర్ చేసిన‌ట్లు సినిమాలో చూపించారు.  సినిమాలో వెలుగుదేశం పార్టీ అని చూపించినా వ‌ర్మ ఇన్‌టెన్ష‌న్ మాత్రం తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబుని అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే.  వ‌ర్మ‌ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడి  వ‌ర్మ ఎవ‌ర్ని ఉద్దేశించి ఈ పాత్ర‌ను చేశాడూ అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. సినిమాలో బాబుని చాలా కించ‌ప‌రుస్తూ చూపించాడు. ఇక బాబుకి ఇంత‌క‌న్నా ఘోర‌మైన అవ‌మానం ఉండ‌దని సినిమా చూసిన వాళ్ళంద‌రూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: