ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే టాలీవుడ్ శోక సముద్రంలో మునిగిపోయింది.  గత కొంత కాలంగా గొల్లపూడి మారుతీరావు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు.  1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావుకి  ముగ్గురు కుమారులు. అయితే ‘ప్రేమ పుస్తకం’అనే మూవీకి దర్శకత్వం వహిస్తూ గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ చనిపోయారు.  అప్పలో ఈ సంఘటన ఆయనను ఎంతో కలచి వేసింది.. మీడియాకు దూరంగా ఉన్నారు.  కానీ మనోధైర్యంతో బుల్లితెరపై ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు. ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలకు నాంధి పలికారు. ఆయన నటించిన తొలి మూవీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982లో రిలీజయ్యింది.  

 

తాజాగా గొల్లపూడి కన్నుమూతపై మెగాస్టార్ స్పందించారు. గొల్లపూడి మారుతీరావు మరణ వార్త వినగానే ఒక్కసారే షాక్ కి గురయ్యానని అన్నారు.  ఆయన నాకు గురువులాంటి వారని... మా మద్య గురుశిష్యుల సంబంధం ఎంతో గొప్పగా సాగిందని అన్నారు. ఆ మధ్య  తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్  అవార్డ్ కార్యక్రమానికి నేను వెళ్లా... తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదని అన్నారు.  నేను 1979లో ‘ఐ లవ్‌ యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతీరావుగారిని పరిచయం చేశారు.

 

అప్పటికే ఆయన చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు.  సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు అనుభవం ఉన్న ఆయన వద్దకు వెళ్లి  డైలాగులు ఎలా పలకాలో ఆయన వద్ద క్లాస్‌లు తీసుకున్నా. అప్పుడే మా పరిచయం స్నేహంగా మారింది.. అప్పటి నుంచి టీ.నగర్ లో ఆయన ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాన్ని...అలా మా మద్య గురుశిష్యుల సంబంధం ఏర్పడింది. గొల్లపూడి మారుతీరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని అన్నారు చిరంజీవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: