విలక్షణ నటుడిగా.. హాస్యనటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు, వక్తగా, కాలమిస్టుగా తెలుగు సాహితీలోకంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన గొల్లపూడి మారుతీరావు మరణం తెలుగు పరిశ్రమకు తీరని లోటు. కవిగా.. కథకుడిగా ఎన్నో పాత్రలకు జీవం పోసి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచారు గొల్లపూడి. అయితే 42 ఏళ్ళకి సినిమాల్లోకి వచ్చి సంవత్సరానికి 31 సినిమాలు చేసిన గొల్లపూడి కి సినిమాలంటే ద్వేషం.

 

గొల్లపూడి చూడగానే చాలా మందికి గద్దముక్కు పంతులు పాత్ర గుర్తుకువస్తోంది. దీంతో పాటు సింగిల్ పూరీ శర్మ అనే పాత్ర కూడా ఫేమస్. రాఘవేంద్రరావుగారి సుందరకాండ సినిమాలో సింగిల్ పూరీ శర్మ అనే పాత్ర చేశారు. ఆ పాత్ర విపరీతంగా పాపులర్ అయింది. గొల్లపూడి 280 పైగా సినిమాలు చేసినప్పటికి చూడగానే గుర్తుకువచ్చే పేర్లు రెండే రెండు. అవి గద్దముక్కు పంతులు కాదు.. సింగిల్ పూరీ శర్మ. గద్దముక్కు పంతులు పేరు నాకు నేను రాసుకున్నది కాదు. గొల్లపూడి మొదటి సినిమా 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. 560 రోజులు ఆడింది ఆ సినిమా. ఆ తరువాత గొల్లపూడికి వరుసగా నాకు అవకాశాలు వచ్చాయి. గద్దముక్కు పంతులు పేరు ఆయన రెండో సినిమాకి వచ్చింది. అందుకు కారణం ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ. 

 

 ఇక గొల్లపూడికి నాకు నటన అంటే ఇష్టం ఉండేది కాదట.. చాలా ద్వేషించే వారట. 42వ ఏట సినిమాల్లో నటించడం మొదలు పెడితే.. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఆఫీసర్‌గా చక్కని జీవితం గడిపేవారు. ఎప్పుడైతే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారో.. అప్పటి నుండి గొల్లపూడి ఇంటి నుండి బయటకు వచ్చే సరికి ఐదు కార్లు వెయిట్ చేసివట. వాటిని చూసి ఏంటయ్యా.. ఈ కార్లు ఎందుకయ్యా ఇది అని  మేనేజర్‌ని అనేవారట.

 

ఇక గొల్లపూడి సంవత్సరానికి 31 సినిమాలు చేశారంటే ఎవరు నమ్మురు. కానీ అది అక్షర సత్యం. ఆయనకు డబ్బులు ఎలా వచ్చేయో తెలిసేది కాదు..అంతగా సినిమాల్లో బిజీగా ఉంటే అన్నీ గొల్లపూడి భార్య చూసుకునేవారు. ఇక అన్ని సినిమాలు చేసినప్పటికి గొల్లపూడి ఏనాడు డబ్బు కావాలని పని చేయలేదు. ఏనాడూ డబ్బు కోసం ఆలోచించలేదు. ‘నేను గొప్ప నటుడ్ని అని నాకు అనిపించకోవడం వల్ల నాకు పెద్ద నష్టం జరిగేది కాదు.. ఒకవేళ గొప్ప రచయితను కాదని అనిపిస్తే నా ఇగో ఎక్కడో దెబ్బ తినేది’.. అంటూ స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు చెప్పిన మాటలు..ఇప్పటికి చాలామందికి గుర్తే ఉంటుంది. అయితే ఆయనకి సినిమాలంటే ద్వేషం రావడానికి ఒక్కటే కారణం..అదేంటంటే అవసరమున్నా లేకపోయినా కావాలనే విసిగించి ఎక్కువ టేకులు తీసేవారట. ఒక్కోసారి ఇది ఆయనకి నచ్చక సినిమాలను ద్వేషించేవారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: