గత ఏడాది  గీత గోవిందం , టాక్సీవాలా  సినిమాలతో  విజయాలందుకున్న  సెన్సేషనల్  హీరో విజయ్ దేవరకొండ  ఈఏడాది   డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకుంది.    ఈ సినిమా తరువాత  విజయ్   ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్  క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్  అనే చిత్రంలో నటిస్తున్నాడు.
 
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రంలో  విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు  నటిస్తున్నారు.  మరో నాలుగు రోజుల్లో  ఈసినిమా  షూటింగ్ కూడా  పూర్తి కానుంది.  దాంతో  ప్రమోషన్స్  ను కూడా స్టార్ట్ చేశారు.  అందులో  భాగంగా  ఈ రోజు ఈసినిమా లో ఓ హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.  రేపు  మరో హీరోయిన్ ఇజా బెల్లె  ఫస్ట్ లుక్ ను విడుదలచేయనుండగా ఆ మరుసటి  రెండు రోజుల్లో కేథరిన్ థ్రెసా మరియు రాశి ఖన్నా ఫస్ట్ లుక్  పోస్టర్ లను  రిలీజ్ చేయనున్నారు.  
 
ఇక  అలాగే ఈ చిత్రం  యొక్క టీజర్ ను వచ్చే ఏడాది జనవరి 3న విడుదలచేయనున్నట్లుగా తెలుస్తుంది.  సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా  గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరానున్నారు. మరి ఈ చిత్రం తో హిట్ కొట్టి విజయ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.  ఇదిలా ఉంటే  ఈ చిత్రం  తరువాత విజయ్ , మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్న  ఫైటర్ లో నటించనున్నాడు.  వచ్చే నెల  నుండి  ఈ చిత్రం  సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: