యంగ్ హీరోలు దగ్గర్నుంచి సీనియర్ హీరోల వరకు ఇప్పుడొస్తున్న సినిమాలు చేస్తే డిజిటల్ కరెక్షన్ చేయడం అన్నది తప్పనిసరి అయిపోయింది. ఎంత చెక్కుడు వుంటే అంత ఖర్చు. సల్మాన్-షారూఖ్ ల సినిమాలకు మూడు కోట్లు కేవలం వాళ్ల బాడీ, ఫేస్ షేపింగ్ కే ఖర్చు అవుతుందని ఎప్పుడు చెప్పుకునే మాటే మనం వింటూనే ఉన్నం.   మహర్షి సినిమాకు కూడా కోటి రూపాయలు ఇందుకోసమే ఖర్చు చేసారట. అందంగా వున్న హీరోను ఇంకా అందంగా చూపించాలి. అందం తక్కువైన, వయసు ఎక్కువైన హీరోను ఇంకాస్త కష్టపడి అందంగా చూపించాలి. లేదంటే ఫ్యాన్స్, ప్రేక్షకులు థియోటర్స్ కి రారు. అసలే డిజిటల్ మాయాజాలంలో సినిమాలకి అంత గిరాకి ఉండటం లేదు.

 

ఇక అసలు విషయం ఏమిటంటే త్వరలో రాబోయే ఓ సీనియర్ హీరో సినిమాలో ఈ చెక్కుడుకు బడ్జెట్ లేదని, ఏదో అలా అలా మమ అంటూ కంప్లీట్ చేస్తున్నారని తాజాగా ఫిల్మ్ నగర్ లో ఒక మాట వినిపిస్తోంది. అసలే  సీనియర్ హీరో. పైగా విగ్గులు, వయసు వల్ల మొహం మీద, గొంతు దగ్గర, కళ్ల కింద వచ్చిన మార్పులు అన్నీ కవర్ చేయాలి. అరవైలో కూడా ఎంత మన్మధుడిలా వున్నాడో అని 60 వచ్చిన వాళ్లు అసూయ పడేలా వుండాలి. ఇలా చేయాలంటే ఓ కోటి నుంచి రెండు కోట్లు ఖర్చు చేయాలి. నిర్మాతకు ఇదో ఓవర్ బడ్జెట్.

 

కానీ త్వరలో విడుదల కాబోయే ఈ సినిమాకు ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అయిందని, మార్కెట్ లేక, డెఫిసిట్ తో విడుదలవుతోందని వార్తలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇంకా తను ఈ 'చెక్కడు' కు ఖర్చు చేయలేనని ఆ నిర్మాత  చేతులు ఎత్తేసినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటివి అన్నీ ముంబాయి లేదా ఇంటర్ నేషనల్ కంపెనీలకు కాంట్రాక్టు ఇస్తారు.

 

కానీ నిర్మాత దగ్గర బడ్జెట్ లేదని, లోకల్ గా ఉన్న హైదారాబాద్ లోనే డిఐ చేసే వాళ్లనే, వీలయితే ఈ పని కూడా చేయమని వదిలేసినట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ ఇందులో ఎంత వరకు వాస్తవం వుందో.. సినిమా వచ్చాక ఆ సీనియర్ హీరోను తెరపై చూస్తే తప్ప తెలియదు. ఇలాంటి విషయాలలో బడ్జెట్ పెరిగిపోవడం వల్లే నిర్మాతలు సినిమా రిలీజై రిజల్ట్ వచ్చేదాక.. బి పి పేషెంట్ లా తయారవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: