ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షో కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మూడు సీజన్లు గడవగా సౌత్లో ఇంకా తమిళంలో మరియు ఇంకా అనేక భాషల్లో కొద్దికొద్దిగా ఈ షో సదరు లాంగ్వేజ్ కి సంబంధించిన రాష్ట్రాలు అలవాటు చేసుకుంటున్నాయి. మొదటిగా భారతదేశంలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. మొదటిలో కొంత మంది యాంకరింగ్ చేసిన గత పది సంవత్సరాల నుండి కండలవీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రియాల్టీ షో కి యాంకరింగ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హిందీ లో 13వ సీజన్ రన్ అవుతోంది. ఎంతో ఆసక్తికరంగా షో ప్రసారం అవుతున్న సమయంలో యాంకరింగ్ చేస్తున్న సల్మాన్ ఖాన్ సడన్ గా యాంకరింగ్ చేయడానికి ఇష్టపడటం లేదని వార్తలు వినబడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే ఇటీవల హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్ ల మధ్య గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో యాంకరింగ్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ఓ వర్గానికి చెందిన వాళ్లకి కొమ్ముకాస్తున్నట్లు వార్తలు గుప్పుమన్న నేపధ్యంలో దానికి నొచ్చుకొని కండలవీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో యాంకరింగ్ చేయడానికి ఇష్టపడటం లేదని అదేవిధంగా హిందీ బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా సల్మాన్ ప్లేసులో యాంకరింగ్ చేయడానికి డాన్స్ మాస్టర్ ఫరా ఖాన్ నీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

మరోపక్క సల్మాన్ ఖాన్ కి సన్నిహితంగా ఉండే వాళ్లు మాత్రం సల్మాన్ ఖాన్ షో నుండి తప్పుకోవడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని  సీజన్ 13లో కంటెస్టెంట్ల మధ్య గొడవలను సాత్వికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. మరో పక్క హౌస్ లో వాతావరణం కంటెస్టెంట్ ల మధ్య పోరు నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా పదమూడవ సీజన్లో సిద్ధార్థ్ శుక్లా, రష్మీ దేశాయ్‌ ఇద్దరి మధ్య టైటిల్ పోరు నువ్వానేనా అన్నట్టుగా ఉంది అని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: