ఒక్కోసారి సినిమా సూపర్ హిట్ అయినా ఆ సినిమాకు పని చేసినవారికి పెద్దగా క్రెడిట్ రాదు. కెరీర్ కూడా టేకాఫ్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ క్రెడిట్ ఇంకెవరికో దక్కుతుంది. వాళ్ళు పాపులర్ అయి అసలు వాళ్ళు అడుగున పడిపోతారు. 'క్షణం' సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు రవికాంత్ పేరెపు పరిస్థితి కూడా ఇప్పుడు అంతే అని ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు చెప్పుకుంటున్నారు. ఆ సినిమాకు రవికాంత్ దర్శకుడు అయినప్పటికీ ఎక్కువ క్రెడిట్ అడివి శేష్ కు వెళ్లిపోయింది. హీరోగానే కాకుండా స్క్రిప్ట్ వర్క్ లో.. మేకింగ్ లో శేష్ ప్రమేయం ఉండడంతో ఎక్కువ క్రెడిట్ శేష్ కే వెళ్తోందని అంటున్నారు.

 

'క్షణం' తర్వాత ఇన్ని రోజులకు దర్శకుడు రవికాంత్ ఒక సినిమాను తెరకెక్కించాడు. సినిమా టైటిల్ 'కృష్ణ అండ్ హిస్ లీల'.  'గుంటూరు టాకీస్' ఫేమ్ సిద్దు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్.. సీరత్ కపూర్.. శాలిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే కలర్ఫుల్ గా ఉంది. అందరిని బాగా ఆకట్టుకుంటుంది. 'పుకార్ల ఆధారంగా' అని క్యాప్షన్ ఇస్తూ 'కృష్ణ అండ్ హిస్ లీల' అనే టైటిల్ ను డిజైన్ చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్.. వయకాం 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు రానా దగ్గుబాటి ఈ సినిమాను సమర్పిస్తుండటం విశేషం.

 

సినిమా హీరో సిద్ధూ రవికాంత్ తో పాటు సహ రచయితగా వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అయినా రవికాంత్ కు క్రెడిట్ వస్తుందా..లేదా అనేది సినిమా రిలీజైతే గాని తెలీదు. ఇక ఈ సినిమాజోనర్ లో తెరకెక్కుతోంది,  ఇతర టెక్నీషియన్స్ ఎవరు..రిలీజ్ ఎప్పుడు అన్న వివరాలు త్వరలోనే తెలుస్తాయట. ఇక 2019 లో వచ్చిన పెద్ద సినిమాలేవి అంతగా సక్సస్ ను అందుకోలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు మాత్రం మంచి సక్సస్ ను అందుకున్నాయి. ముఖ్యంగా పూరి- రాం కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: