ఒకరు కాదు ఇద్దరు సరిపోక ఏకంగా ముప్ఫై మంది హీరోయిన్స్ ని లైంగికంగా వేధించాడు ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టైన్. రెండేళ్ల క్రితం ఓ నటి హార్వే ఎలాంటివాడో బయటపెట్టి హాలీవుడ్‌లలో మీటూ ఉద్యమానికి తెర తీసింది. ఆ తర్వాత ఎందరో నటీమణులు మేమూ హార్వే వల్ల లైంగికంగా వేధించబడినవాళ్లమేనంటూ మీడియా ముందుకు వచ్చారు. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ని కూడా హార్వే లైంగకంగా వేధించాలనుకున్నాడట. కానీ అప్పట్లో ఐష్ మేనేజర్ అలాంటివేమీ జరగకుండా జాగ్రత్తపడ్డారట.

 

తనపై ఆరోపణలు చేసి కోర్టులో కేసులు వేసిన బాధితులకు డబ్బులిచ్చి డీల్ కుదుర్చుకోవాలనుకున్నాడు హర్వే. ఈ విషయాన్ని తన లాయర్ల ద్వారా మీడియా ముందు వెల్లడించాడు. మొత్తం 176 కోట్ల 71లక్షల 25వేలు ఇచ్చి డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే తన సంపాదన నుంచి హార్వే ఈ డబ్బును ఇవ్వడంలేదు. తన ప్రొడక్షన్ కంపెనీకి ఉన్న బీమా డబ్బులతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇందుకు కేసులు వేసిన వాళ్లు కూడా ఒప్పుకుంటే తాను చేసిన నేరాలను హార్వే కోర్టులో కూడా ఒప్పుకుని తీరాలి.

 

హార్వే చేత లైంగికంగా వేధించబడిన హాలీవుడ్ నటి కేథరీన్ కెండల్ ఈ డీల్ గురించి మీడియాతో మాట్లాడారు. తనకు ఏమాత్రం నచ్చలేదని, చేసిన తప్పులకు హార్వేకి శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేసింది. అయితే ఈ విషయంలో తానొక్కత్తే పోరాడితే ఇతర బాధితులకు జరిమానా రాకుండాపోతుందని మౌనంగా ఉంటున్నానని తెలిపారు. హార్వే విషయంలో డబ్బు తీసుకుని మౌనంగా ఉండటం తప్ప తానేమీ చేయలేకపోతున్నానని వెల్లడించారు. అయితే డీల్ ఇష్టంలేని బాధితులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోమని న్యాయవాదులు హార్వే కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. 

 

హార్వే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌పైన కూడా కన్నేశాడట. ఓసారి ఐశ్వర్యను ఒంటరిగా తన గదిలో కలవాలనుకుంటున్నానని హార్వే ఐష్ ఇంటర్నేషనల్ టాలెంట్ మేనేజర్‌‌తో అన్నాడట. అయితే హార్వే వెధవ కాబట్టి ఆ విషయం ముందే పసిగట్టిన మేనేజర్ వొప్పుకోలేదట.  చాలాసార్లు ఐశ్వర్యను మీటింగ్‌కి పిలిచేవాడట. ఎలాగైనా ఐష్ ను పర్సనల్ గా కలవడానికి ఎన్నో సార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: