సౌత్‌ హీరోయిన్స్ ఎవరైనా బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కోసం వెంపర్లాడతారు. ఒక్క ఛాన్స్ వస్తే బావుండు అని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఒకవేళ గనక లక్కీగా ఒక అవకాశం వస్తే ఎగిరి గంతేసి మరి ఓకే చెప్తారు. అలాంటిది టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, అక్కినేని కోడలు సమంత మాత్రం బాలీవుడ్‌ సినిమాకు నో చెప్పింది. ప్రస్తుతం 96 సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో శర్వానంద్‌కు జోడిగా నటిస్తున్న సాం కి బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు క్రేజీ ఆఫర్‌ ఇచ్చారు.

 

కెరీర్‌ స్టార్టింగ్‌లో గ్లామర్‌ రోల్స్‌లో నటించిన సమంత పెళ్లి తరువాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. అదే బాటలో సమంత లీడ్‌ రోల్‌లో నటించిన సినిమా 'యూ టర్న్‌'. కన్నడ సూపర్‌ హిట్‌ సినిమాకు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ పరవాలేదనిపించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు దర్శక, నిర్మాతలు రెడీ అవుతున్నారు. అయితే తెలుగులో అద్భుతంగా నటించి మెప్పించిన సమంతను హిందీ వర్షన్‌లోనూ నటింప చేసేందుకు యూనిట్ సంప్రదించారు. అయితే సమంత మాత్రం ఈ ప్రపోజల్‌ను సున్నితంగా తిరస్కరించింది. ఒకసారి చేసిన పాత్రను మరోసారి పోషించేందుకు తనకు ఇంట్రస్ట్‌ లేదని తేల్చి చెప్పేసింది. దీంతో మరో నటిని వెతికే పనిలో ఉన్నారు బాలీవుడ్ మేకర్స్.

 

సౌత్‌లో టాప్‌ పొజిషన్‌లో కొనసాగుతున్న సామ్‌ ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే అది సిల్వర్‌ స్క్రీన్‌పై మాత్రం కాదు. మనోజ్‌ బాజ్‌పాయ్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లో కీలక పాత్రలో నటించింది సామ్‌. ప్రస్తుతం 96 రీమేక్‌ తప్ప మరో సినిమాకు అంగీకరించని సమంత సినిమాల నుంచి షార్ట్‌ బ్రేక్‌ తీసుకునే ఆలోచనలో ఉందట. అయితే మళ్ళీ మజిలీ వంటి కథ ఉంటే చేయాలనే ఆలోచనలో చైతూ-సమంత ఉన్నారని ఇన్‌సైడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: