అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంకు సంబంధించిన న్యూ స్టిల్ ని స్వయంగా విజయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసారు. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. ఐశ్వర్యా రాజేష్ తల స్నానం చేసి, ఆకు పచ్చ చీర కట్టుకొని కూరగాయలు కట్ చేస్తున్నా సందర్భంలో విజయ్ ఆమెతో రొమాన్స్ చేస్తున్నారన్నది తెలుస్తుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ మినహాయించి మరో ముగ్గురు హీరోయిన్లు.. రాశిఖన్నా, క్యాథరిన్ తెస్రా, ఇజా బెల్ల లెయితే ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అయితే... వీరికి సంబంధించిన ఈ మూవీ లోని లుక్ లను కూడా విజయ్ విడుదల చేయనున్నారు. డిసెంబర్13 సాయంత్రం ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌ లుక్స్ ను విడుదల చేయనున్నారు.



https://www.instagram.com/p/B5-RioghpFK/?igshid=8ixo7wi2tubg

ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం... ఈ చిత్రంలో విజయ్ శీనయ్య, ఐశ్వర్యా సువర్ణ పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా లో విజయ్ ఒక ఆసక్తికరమైన ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్బంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ ఫేమస్ లవర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

https://mobile.twitter.com/aishu_dil/status/1205104821646192645

హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో వరల్డ్ ఫేమస్ లవర్ న్యూ లుక్ ను షేర్ చేసింది. ఆమె పోస్ట్ లో ... ''నా పేరు సువర్ణ..  ఆయన పేరు శీనయ్య.. మా ఆయనే 'వరల్డ్ ఫేమస్ లవర్'.. మా శీనయ్యను ప్రేమికుల రోజున కలుద్ధాం' అని పేర్కొన్నారు. ఇంకో ముచ్చట అంటూ... మూవీ కు సంబంధించిన టీజర్‌ను జనవరి 3 విడుదల చేయనున్నట్లు తెలిపారు ఐశ్వర్యా.

మరింత సమాచారం తెలుసుకోండి: