‘వెంకీ మామ’ రిజల్ట్ ఇంకా పూర్తిగా తెలియకుండానే వెంకటేష్ నోటివెంట రిటైర్ మెంట్ ఆలోచనలు బయటకు రావడం షాకింగ్ గా మారింది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎప్పటికప్పుడు సినిమాల నుండి రిటైర్ అవ్వాలి అని భావిస్తునప్పుడల్లా ఎవరో ఒకరు తనకు ఒక మంచి కథ చెప్పి సినిమాల పై తనకు ఆసక్తి కలిగేల చేస్తున్నారు అంటూ జోక్ చేసారు. 

ఇండస్ట్రీలోకి వచ్చి 33సంవత్సరాలు పూర్తి అయిందని అంటూ తనకు రిటైర్ మెంట్ ఆలోచనలు గత 5 సంవత్సరాల క్రితమే వచ్చాయని అయితే తనలో ఇంకా పాజిటివ్ ఎనర్జీ తగ్గక పోవడంతో ఆ ఎనర్జీని వృథా చేయడం ఇష్టం లేక తాను ఇంకా నటిస్తున్న విషయాన్ని తెలియచేసాడు. అంతేకాదు కేవలం తనను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్న రచయితలను చూస్తుంటే తనకు ఇంకా ఇంత క్రేజ్ ఉందా అన్న ఆశ్చర్యం ఒకసారి తన పై తనకే కలుగుతుంది అంటూ వెంకటేష్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 


ఇక తాను రానున్న రోజులలో ఎక్కువగా మల్టీ స్టార్స్ లోనే నటిస్తాను అంటూ తనకు నానీతో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉంది అన్న తన కోరికను బయట పెట్టాడు.  ప్రస్తుత తరం యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ వారంతా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఇంకా చాల సినిమాలు చేయాలని సినిమాలు తగ్గిస్తే ఈ పోటీ ప్రపంచంలో వారు రానున్న రోజులలో నిలబడటం కష్టం అన్న తన అభిప్రాయాన్ని తెలియ చేసాడు. 

ఇక తన కొడుకు గురించి మాట్లాడుతూ అర్జున్ సినిమాలలోకి వస్తాడని తనకు అనిపించడం లేదని ప్రస్తుతానికి అటువంటి సూచనలు కూడ తన కొడుకు ప్రవర్తనలో కనిపించడం లేదు అంటూ తన వారసుడు ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు. అయితే తాను సినిమాలలోకి రమ్మని తన కొడుకు పై ఒత్తిడి చేయను అని చెపుతూ తనకు ఏది అభిరుచి ఉంటే ఆ రంగంలో ప్రోత్సహిస్తాను కాని తనకు వారసుల ఎంట్రీ పై పెద్దగా ఆసక్తి లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: