విక్టరీ వెంకటేష్ తన అభిమానులచేత పిలిపించుకునే ఈ ఎనర్జిటిక్ హీరోకు నేడు 59వ పుట్టినరోజు జరుపుకుంటూ వచ్చే ఏడాది షష్టి పూర్తి జరుపుకోబోతున్నాడు.  సీనియర్ హీరోలు అంతా  షష్ఠిపూర్తి ఉత్సవాలకు రెడీ అయిపోతున్న నేపధ్యంలో ఇప్పుడు ఈలిస్టులోకి వెంకటేష్ కూడ చేరి పోయాడు.  

వయసుతో  సంబంధం లేకుండా తన  కెరీర్ పరంగా జోరు చూపిస్తున్న ఈ సీనియర్ హీరో ఈరోజు తన పుట్టినరోజును చాల విభిన్నంగా జరుపుకుంటున్నాడు. ఈ రోజు ‘వెంకీ మామ’ మూవీ మన తెలుగు రాష్ట్రాలలో 653 థియేటర్స్ లో విడుదలవుతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రదర్శింపబడే  మొత్తం 653 సింగిల్ స్క్రీన్లలోను వెంకీ అభిమానులు ‘వెంకీ మామ’ ను తన పక్కన పెట్టుకుని 653 కేజీల కేక్ కట్ చేయడానికి భారీ ఏర్పాట్లు పూర్తి చేసారు. 
 

వాస్తవానికి వెంకటేష్ ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటాడు. అయితే  వెంకటేష్ అభిమానులు మాత్రం ‘వెంకీ మామ’ బ్లాకు బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ప్రతి ధియేటర్ లో చేస్తున్న హడావిడిని ‘వెంకీ మామ’ ప్రమోషన్ కోసం చాలా తెలివిగా వాడుకుంటున్నారు. వెంకటేష్ కెరియర్ లో ఇప్పటివరకు 100 కోట్ల కలెక్షన్స్ ఫిగర్ ను అందుకోలేదు. 

సక్సస్ పరంగా వెంకటేష్ సినిమాలు ఎన్నో విజయవంతం అయినా కలెక్షన్స్ రికార్డుల విషయంలో వెంకటేష్ సీనియర్ హీరోల లిస్టులో చివరిగానే కొనసాగుతున్నాడు. దీనితో వెంకటేష్ కళలను ఈరోజు విడుదల అవుతున్న ‘వెంకీ మామ’ ఎంతవరకు నెరవేర్చ గలుగుతుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది.  ఇప్పటికే ఈ సినిమా ప్రీ పాజిటివ్ టాక్ ఉన్న నేపధ్యంలో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తరువాత ఇండస్ట్రీలో సరి అయిన హిట్ లేకపోయిన పరిస్థితులలో వెలవెల పోతున్న థియేటర్స్ కు జనంతో కళ తెప్పించే విషయంలో ‘వెంకీ మామ’ ఎంతవరకు విజయం సాధిస్తుంది అన్నవిషయం మరి కొన్ని గంటలలో తేలిపోతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: