విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మేనమామ, మేనల్లుడు గా తెరకెక్కిన చిత్రం వెంకీ మామ. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎస్‌. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ మూవీపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ కావటం... టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత తెరకెక్కనున్న మల్టీస్టారర్ కావడంతో సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.

 

గత రెండు నెలలుగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ సినిమా.. వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఇక యూఎస్‌లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ కావడంతో వెంకీ మామ కు యావరేజ్ యావరేజ్ టాక్ వస్తోంది. ఇక ఫ‌స్టాఫ్ లో కామెడీ, రొమాంటిక్ యాంగిల్‌, సాంగ్స్ ప‌రంగా బాగున్నా... ద‌ర్శ‌కుడు బాబి కీల‌క‌మైన సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే ప‌రంగా క‌న్‌ఫ్యూజ్ చేయ‌డం.. ప‌దే పేద ఫ్లాష‌బ్యాక్ ఎపిసోడ్లు, ఫ్లాష్ బ్యాక్‌లోనే మ‌రో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రావ‌డం కూడా ప్రేక్ష‌కులు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు.

 

ఇక సినిమా ఫ్ల‌స్ పాయింట్స్ విష‌యానికి వ‌స్తే వెంకీ మరియు చైతూల పెర్ఫామెన్స్ బాగుంది. నాగ‌చైత‌న్య యే ఎక్కువుగా స్క్రీన్ మీద క‌న‌ప‌డినా.. చైతు సీన్లే బాగా పేలాయి. ఫస్ట్ హాఫ్ లోని కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. ఇద్ద‌రు హీరోలు - ఇద్ద‌రు హీరోలు ఉన్నా వారి మ‌ధ్య స‌రైన కెమిస్ట్రీ పండించ‌లేదు. ఇక థ‌మ‌న్ నేప‌థ్య సంగీతంతో మెప్పించినా... పాట‌ల విష‌యంలో తేలిపోయినట్ల‌య్యింది. ఇక సురేష్ ప్ర‌డ‌క్ష‌న్స్ వారి నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ చూస్తే ద‌ర్శ‌కుడు బాబి స్క్రీన్ ప్లే సెకండాఫ్ లో గంద‌ర‌గోళంగా ఉంది. సెకండాఫ్ లో 
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా ఎక్కువగా చూపించడం.. అందులోనూ ఫ్లాష్ బ్యాక్‌లో మ‌రో ఫ్లాష్ బ్యాక్ రావ‌డం మ‌రింత మైన‌స్‌. కీల‌క‌మైన సెకండాఫ్ లో సీన్లు బాగా వీక్ అయిపోయాయి. ఇక క్లైమాక్స్ ఓ మోస్త‌రుగా ముగిసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: