విక్టరీ వెంకటేశ్,  యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి. సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్నినిర్మించారు. విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా కోసం ఇటు దగ్గుబాటి అభిమానులతో పాటు అటు అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్త‌వానికి ఈ మ‌ధ్య కాలంలో వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌పై దృష్టి పెట్ట‌డంతో.. ఇటీవ‌ల‌ వ‌చ్చిన ఎఫ్2 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందించింది.

 

ఈ క్ర‌మంలోనే వెంక‌మామ సినిమాపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేశ్‌ది సెపరేట్ స్టైల్. అందరి హీరోల్లా కాకుండా.. తనదైన డిఫరెంట్ యాక్టింగ్‌తో క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన నటుడు. తన స్టార్ డమ్ ఇమేజ్ లను పక్కన పెట్టి మంచి కథాబలం ఉండే సినిమాలకు ప్రాధాన్యతనిస్తాడు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ బాబు బంగారం. 33 ఏళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో తిరుగులేని ప్ర‌యాణం సాగిస్తున్న సంచ‌ల‌న హీరో వెంక‌టేష్. ఈ రోజు వెంకీ మామ బర్త్ డే. మ‌రివైపు వెంకీమామ విడుద‌ల కూడా ఆ రోజు కావ‌డం విశేషం.

 

అయితే ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను. అంతేకాదు హార్డ్ వర్క్‌ను నమ్ముకున్నాను. ఐదేళ్ల నుండి సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నా.. కావడం లేదు. నాలో ఇంకా విషయం ఉందని దర్శక నిర్మాతలు భావిస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం తెలుగులో మిగతా హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నాను. అలాగే కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగ చైతన్య, వరుణ్ తేజ్, రామ్‌‌ లతో మల్టీస్టారర్ సినిమాలు చేసాను. ఒకవేళ చేయాల్సి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లతో మల్టీస్టారర్ చేయాలని ఉంద‌ని చెప్పారు. ఇదిలా ఉంటే సంక్రాంతి బరిలో కాకుండా, వెంకటేశ్ బర్త్‌డే రోజున రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద వెంకీమామ‌ కాసుల వర్షం కురవడం ఖాయమని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: