మామ విక్టరీ వెంకటేష్... అల్లుడు నాగచైతన్య హీరోలుగా... తెరకెక్కిన సినిమా వెంకీ మామ. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నేడు వెంకీ మామ సినిమా... ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది . రీల్ లైఫ్లోనే మామా అల్లుళ్లు రియల్ లైఫ్లోనే మామా అల్లుళ్లుగా  వెంకీ మామ సినిమా తెరకెక్కింది. కుటుంబ కథా చిత్రంగా వినోదభరితంగా సాగే ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన టాలీవుడ్ హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా... నాగచైతన్య సరసన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటించింది. కాగా ఈ సినిమాలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా  వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా పై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 

 

 

 

 ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచిన వెంకటేష్ సినిమా ఎఫ్2 లాగే ఈ సినిమా కూడా ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. కాగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో సంగీత దర్శకుడు తమన్ చేకూర్చిన సంగీతం ప్రేక్షకులను మెప్పించింది. ఇక హీరోయిన్ల పాత్రలకు ఈ సినిమాలో అంతగా ప్రాధాన్యత లేదు. అయితే ఈ సినిమాలో వెంకీ మామ యాక్షన్ కామెడీ ముందు నాగచైతన్య తేలి పోయినట్లు తెలుస్తోంది. వెంకి మామ సినిమాలో విక్టరీ వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మైమరపించి వన్ మ్యాన్ షోగా సినిమాను ముందుకు తీసుకెళ్ళాడు. సినిమా మొత్తం ప్రేక్షకుని దృష్టంతా వెంకటేష్ పైనే ఉంటుంది. 

 

 

 

 ఇక ఈ సినిమాలో ఎప్పటిలాగే తన మార్కును చాటుకున్నాడు విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ కి ఫామిలీ కథా  సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే హీరో అన్నట్లుగా మంచి పేరు ఉంది. ఈ సినిమాలో కూడా మరోసారి ఫ్యామిలీకథ చిత్రాలకు వెంకటేష్ కేరాఫ్ అడ్రస్ అని  నిరూపించుకున్నాడు. తనదైన స్టైల్ కామెడీ టైమింగ్ తో... కుటుంబ కథ సెంటిమెంట్ సీన్ లతో... సినిమా చూస్తున్న ప్రేక్షకులందరినీ ఓవైపు కడుపుబ్బా నవ్విస్తూనే... మరోవైపు ఏడిపించాడు కూడా. ఏమైనా వెంకటేష్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదబ్బా. అప్పుడు అదే కామెడీ టైమింగ్ తో అదరగొట్టే సెంటిమెంట్ సీన్లలో మనుసులు  కొల్లగొట్టాడు. ఇప్పుడు కూడా తన కామెడీ టైమింగ్... సెంటిమెంట్ సీన్ ల విషయంలో యువ హీరోలు కూడా తనకు సాటి రారని మరోసారి నిరూపించాడు విక్టరీ వెంకటేష్. ఏదేమైనా వెంకటేష్ మాత్రం... తన కామెడీ టైమింగ్... ఎమోషనల్ నటనలో... ఇంకా ఏం మారలేదు... ఇంకా యువ హీరోలు సైతం డామినేట్ చేస్తూనే ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: