ఒక యంగ్ హీరోకు వరసగా 11 పరాజయాలు ఎదురైతే ఆ హీరో కెరియర్ పూర్తిగా ముగిసిపోతుంది. అయితే ‘ఇష్క్’ తర్వాత నితిన్ కెరియర్ తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ప్రస్తుతం ‘భీష్మ’ సినిమాతో మరోసారి హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ యంగ్ హీరో తన పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నలు ఎదురు అయినా ఆ ప్రశ్నల పై ఎప్పుడు సమాధానం దాట వేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తున్న ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీ వర్గాలలో నితిన్ పెళ్లి గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 

ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది నితిన్ పెళ్లి గురించి మాట్లాడు కుంటున్నారు.  తెలుస్తున్న సమాచారం వరకు నితిన్ పెళ్ళి ఏప్రియల్ లో జరగబోతోందని అతడు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని ఇండస్ట్రీ వర్గాలకు చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాదని హైదరాబాద్ కు చెందిన ఒక పారిశ్రామిక వేక్త కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. 

గత కొంతకాలంగా మళ్ళీ వరస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ మళ్ళీ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘భీష్మ' ‘రంగ్ దే' ‘చదరంగం' సినిమాలతో బిజీ బిజీగా ఉంటూ వచ్చే ఏడాది తన వైపు నుండి మూడు సినిమాలు విడుదల అయ్యేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కావడంతో నితిన్ కెరియర్ కు సుధాకర్ రెడ్డి సపోర్ట్ అన్ని విధాల సహకరిస్తోంది. 

ఇండస్ట్రీకి సంబంధించి ప్రభాస్ పై అదేవిధంగా నితిన్ పై ఇలా పెళ్ళి విషయమై రూమర్స్ రావడం ఇది మొదటిసారి కాదు. ఇలా గతంలో చాలాసార్లు వీరిద్దరి పై వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నితిన్ పై ఇలాంటి రూమర్లు వస్తూ ఉండటంతో ఈ వార్తలలో ఎన్ని యదార్దాలో తెలుసుకోవడానికి ఇండస్ట్రీలోని కొందరు నితిన్ తండ్రి దగ్గర నుండి ఈ విషయమై వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: