సినిమాల్లో ఛాన్స్ రావడం అంటే సామాన్య విషయం కాదు.  కష్టపడి ఒక్కపాత్ర దక్కించుకోవాలంటే తపస్సు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.. అలా వచ్చినప్పటికీ దానికి అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు కొంత మంది నటులు.  ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మూవీల్ ఆడిషన్స్ లో రిజక్ట్ అయిన వారు తర్వాత కాలంలో సూపర్ స్టార్ పొజీషన్ కి వచ్చారు.  అలాంటి వారిలో నేటితరం హీరోలు సైతం ఉన్నారంటే అశ్చర్యం లేదు.  ఒకప్పుడు తేనె మనసులు మూవీ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  అయితే ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్.  అప్పట్లో ఆదుర్తి సుబ్బారావుగారు కొత్త నటీనటులతో 'తేనెమనసులు' సినిమాను రూపొందించాలనుకున్నారు.  

 

తేనె మనసు మూవీ లో కొత్త నటుల గురించి ఓ పేపర్ యాడ్ ఇచ్చారట.  అప్పటికే సినిమాల్లో నటించాలనే ఆసక్తి అందరిలో  పెరిగిపోవడంతో ఆడిషన్స్ కి విపరీతంగా వచ్చారు. ఈ నేపథ్యంలో ఆడిషన్ లో భాగంగా బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పిన డ్రీమ్ గర్ల్ హేమామాలిని, నటి, సీఎం గా ఉన్నతశిఖరాలు అధిరోహించిన జయలలిత, ప్రముఖ నటులు కృష్ణం రాజు కూడా ఆడిషన్ కి వచ్చారట.  హీరోయిన్స్ కోసం వారు చేసిన ఆడిషన్ టీమ్ కి నచ్చకపోవడంతో రిజక్ట్ చేశారట.  ఎంతో ఆశగా వచ్చిన ఆ ఇద్దరు నటీమణులు నిశాతో వెళ్లిపోయారట.  

 

ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజు సైతం ఆడిషన్ కి వచ్చి రిజక్ట్ అయ్యారట.  కానీ ఈ మూవీలో కృష్ణ ని తీసుకోవడం విశేషం. కానీ ఆ తరువాత కాలంలో ఈ ముగ్గురూ చిత్రపరిశ్రమలో ఏ స్థాయికి చేరుకున్నారన్నది అందరికీ తెలిసిందే. 'తేనె మనసులు' సినిమా కోసం ఎంపికైనవారిలో ఒక్క కృష్ణగారు మాత్రమే సూపర్ స్టార్ గా ఎదిగారు అని చెప్పుకొచ్చారు.  అప్పట్లో ఎంత గొప్ప నటులకైనా హావభావాలు చూసి మాత్రమే ఇచ్చేవారని అన్నారు. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: