రియల్ లైఫ్ లో ని మామా అల్లుళ్లు... రియల్ లైఫ్లో కూడా మామ అల్లుల్లుగా నటించిన చిత్రం వెంకీ మామ. అక్కినేని వారసుడు... దగ్గుబాటి వారసుడు హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా నాగచైతన్య సరసన అందాల చందమామ రాసి కన్నా నటించింది. కాగా ఈ సినిమా నేడు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది . అయితే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను  చేరుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా. 

 

 

 

 ఈ సినిమాలో నాగ చైతన్య వెంకటేశ్ చేసిన  సందడి ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంది. ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా మొత్తం సాగుతుంది. దీంతో సగటు ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకున్నారు. అయితే ఈ సినిమాలు అన్ని బాలన్స్ చేస్తూ తెరకెక్కించాడు దర్శకుడు బాబి. కామెడీ సెంటిమెంట్ యాక్షన్ ఇలా ప్రతి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్నింటినీ సమపాళ్ళలో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ నేపథ్యం బాగుండటంతో పాటు... నాగచైతన్య వెంకటేష్ ల మధ్య కామెడీ సినిమాలో బాగా పండింది... అంతేకాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ విషయంలో వెంకటేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తనదైన స్టైల్ లో మరోసారి సెంటిమెంట్ సీన్లలో  అదరగొట్టి  ప్రేక్షకుల మనసులు  కొల్లగొట్టాడు విక్టరీ వెంకటేష్. 

 

 

 

 ఈ సినిమా టాక్ చూస్తే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వెంకీమామ సినిమాలో నాగచైతన్య ఇటు వెంకటేష్ ఇద్దరి  సెంటిమెంట్ కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి అంటారా... ఈ ఏడాది ప్రారంభంలో రియల్ లైఫ్ భార్యామణి సమంతతో రీల్ లైఫ్ లో కూడా సమంత నాగచైతన్య భార్యాభర్తలుగా నటించి... మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు కూడా తన రియల్ లైఫ్ మామతో రిల్ లైఫ్ లో కూడా అల్లుడిగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకునేలాగె  కనిపిస్తున్నాడు నాగ చైతన్య. ఇక అటు వెంకటేష్ కూడా ఈ ఏడాది సంక్రాంతి బరిలో మెగా హీరో వరుణ్ తేజ్ తో ఎఫ్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కడుపుబ్బ నవ్వించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన వెంకీమామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్... మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోనున్నట్లే కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: