అక్కినేని వారసుడిగా నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి వచ్చారు... అయితే ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికీ ప్రేక్షకులను  మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు అఖిల్ . దీంతో అక్కినేని వారసుడిగా అందర్నీ ఆకట్టుకుని ప్రేక్షకులను సంపాదించుకున్న హీరో నాగచైతన్య. కాగా అటు దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాల పైనే  అయినప్పటికీ ఇప్పటికీ యువ హీరోలకు పోటీ ఇస్తున్న ధూసుకుపోతున్నారు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్య... దగ్గుబాటి వారసుడు వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా వెంకీ మామ.ఈ  సినిమాలో  రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రిల్ లైఫ్లో కూడా మామా అల్లుళ్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

 

 

 కాగా ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 సినిమాలాగే... వెంకీమామ సినిమాలు కూడా ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెబుతున్నారు. ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడం ఖాయం అని అంటున్నారు ప్రేక్షకులు. అయితే సినిమాలో మామా అల్లుళ్లు అదరగొట్టేసారు. రియల్ లైఫ్లోనే సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించే మామా అల్లుళ్లు ఇప్పుడు ఏకంగా ఫుల్ లెన్త్ సినిమా లో సందడి చేసి  ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెంకీ మామ సినిమాలో నాగచైతన్య వెంకటేష్ మధ్య కథ మొత్తం వినోద భరితంగా సాగిపోతు ఉంటుంది . వీరిద్దరి మధ్య సంభాషణలు కామెడీ మొత్తం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. 

 

 

 అంతేకాకుండా వీరిద్దరి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి. కామెడీ టైమింగ్... ఫ్యామిలీ సెంటిమెంట్ పండించడం విషయంలో వెంకటేష్ గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వెంకటేష్ అంటేనే కుటుంబ కథ  చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. దీంతో సినిమాలో కామెడీ సెంటిమెంట్ యాక్షన్ సన్నివేశాల్లో వెంకటేష్ ఓ మెట్టు పైనే ఉన్నాడు అని చెప్పాలి. ఏకంగా యువ హీరో నాగచైతన్య ను డామినేట్ చేసేసాడు  వెంకటేష్. ఇక ఈ సినిమా కాసుల వర్షం కురిపించడం ఖాయం గా కనిపిస్తోంది. ఏదేమైనా రియల్ లైఫ్ మామా అల్లుళ్లు... రియల్ లైఫ్లో కూడా అదరగొట్టేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: