అక్కినేని వారసుడిగా నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి వచ్చారు... అయితే ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికీ ప్రేక్షకులను  మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు అఖిల్ . దీంతో అక్కినేని వారసుడిగా అందర్నీ ఆకట్టుకుని ప్రేక్షకులను సంపాదించుకున్న హీరో నాగచైతన్య. కాగా అటు దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాల పైనే  అయినప్పటికీ ఇప్పటికీ యువ హీరోలకు పోటీ ఇస్తున్న ధూసుకుపోతున్నారు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్య... దగ్గుబాటి వారసుడు వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా వెంకీ మామ.ఈ  సినిమాలో  రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రిల్ లైఫ్లో కూడా మామా అల్లుళ్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

 

 

 అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుతూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది .వెంకీ మామ సినిమా  చూస్తున్న ప్రేక్షకులు అందరిని ఓ రేంజిలో కడుపుబ్బ నవ్విస్తూ... మరోవైపు ఫ్యామిలీ సెంటిమెంట్ తో అందరి ప్రమోషన్లు ముంచేస్తుంది . ఇక ఈ సినిమాలో మామా అల్లుళ్లు గా నటించిన రియల్ లైఫ్ మామా అల్లుళ్లు నాగచైతన్య వెంకటేశ్ లు... అదరగొట్టారు అనే చెప్పాలి. తమదైన స్టైల్లో ఎవరికివారు తమ సత్తా చాటారు. అయితే కామెడీ టైమింగ్,  సెంటిమెంట్ విషయంలో విక్టరీ వెంకటేష్ ఓ మెట్టు పైనే ఉన్నాడు అని చెప్పాలి. అక్కినేని హీరో నాగ చైతన్యను వెంకటేష్ కాస్త డామినేట్ చేసి వన్ మ్యాన్ షోగా  ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు వెంకటేష్ . అయితే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. 

 

 

 ఇదిలా ఉంటే... వెంకటేష్ కు  మల్టీస్టారర్ సినిమాలు భారీ విజయాలను సొంతం తెచ్చిపెడుతున్నాయి . ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఎఫ్2 సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ వెంకటేష్ హీరోలుగా  నటించి సందడి చేశారు. ఇక ఇప్పుడు నాగచైతన్య వెంకటేష్ హీరోలుగా విడుదలైన వెంకీ మామ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు అందరూ... యువ హీరోలతో వెంకటేష్ కాంబినేషన్ సూపర్ గా  సెట్టయిందని... ఫ్యూచర్లో కూడా వెంకటేష్ ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. సోలో హీరోగా సినిమాల కంటే ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తేనే మాకు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: